Rajaiah-Vinay Bhasker: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ కలిశారు. రాజయ్యను వినయ్ భాస్కర్ శాంతింపజేస్తున్నట్లు సమాచారం. స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంతో తాటికొండ రాజయ్య అసంతృప్తితో ఉన్నారు. ఈ స్థానం నుంచి కడియం శ్రీహరికి బీఆర్‌ఎస్ నాయకత్వం టికెట్ కేటాయించింది. దీంతో తాటికొండ రాజయ్య తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. రాజయ్య ప్రజల్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. పంట చేతికందగానే కుప్పపై కూర్చోవడానికి వస్తే చూస్తూ కూర్చుంటామని వ్యాఖ్యానించారు. అంబేద్కర్ విగ్రహం పెట్టి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ పరిణామాలతో తాటికొండ రాజయ్య వద్దకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డిని కేసీఆర్ తన దూతగా పంపారు. కానీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని రాజయ్య కలవలేదు. రాజయ్య నివాసానికి పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు. దీనిపై తాటికొండ రాజయ్య అనుచరులతో పల్లా రాజేశ్వర్ రెడ్డి చర్చించారు. ఎన్నికల తర్వాత రాజయ్యకు మంచి పదవి ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
Read also: Viral Video: ఓరి దేవుడు.. ఈ పిల్ల ధైర్యం ఏంటి సామి..
కాగా, తాటికొండ రాజయ్య నిన్న మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహను కలిశారు. ఈ భేటీ వరంగల్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది. బీఆర్‌ఎస్ టికెట్ రాకపోవడంతో రాజయ్య కాంగ్రెస్‌లో చేరతారా అనే చర్చ మొదలైంది. దళిత మేధావుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన దామోదర రాజనర్సింహను రాజయ్య కలిశారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని రాజయ్య బంధువులు చెబుతున్నారు. అయితే దీని వెనుక రాజకీయ కారణాలను తోసిపుచ్చలేమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు తాటికొండ రాజయ్యను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కలిశారు. రాజయ్యను బుజ్జగిస్తున్నట్లు సమాచారం. అయితే బీఆర్ఎస్ నాయకత్వ బుజ్జగింపులపై రాజయ్య ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ లోకి వెళ్తారా, ఏం జరుగుతోంది..?
స్టేషన్ ఘన్‌పూర్‌లో తాటికొండ రాజయ్య 2009, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ఈసారి కూడా అదే స్థానం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజయ్యకు టికెట్ ఇవ్వలేదు.
Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. నవంబర్ నాటికి 7 లక్షల ఉద్యోగాలు