Golkonda Bonalu: హైదరాబాద్‌లో బోనాల పండుగ ప్రారంభమైంది. గోల్కొండ కోట లంగర్‌హౌస్ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.
హరిత కాకతీయలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావులు మాట్లాడారు. రామప్పకు యునెస్కో గుర్తింపు కిషన్ రెడ్డి వల్ల వచ్చిందనీ చెప్పుకుంటున్నారని.. ఆయన చేసిందేమీ లేదని మంత్రులు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేటీఆర్, హరీష్ రావు, తెలంగాణ ప్రభుత్వ అధికారుల కృషి వల్ల మాత్రమే గుర్తింపు వచ్చిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.
సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ మంత్రులు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం కోసం సికింద్రాబాద్ వచ్చిన ప్రధాని.. రాజకీయాలు చేయడం మంచిది కాదని మండిపడ్డారు. కుటుంబ పాలన ఉన్న పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోలేదా అని ప్రశ్నించారు.