Site icon NTV Telugu

Kishan Reddy: కవిత ఎపిసోడ్‌పై స్పందించొద్దు.. బీజేపీ నేతలకు కిషన్‌రెడ్డి కీలక సూచనలు..!

Kishanreddy

Kishanreddy

కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై కవిత ఆరోపణలు చేయడం ఏంటి? కవిత ఎందుకు జైలుకు పోయింది? వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటి? అని ప్రశ్నించారు. ఇది డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ సమస్య అని స్పష్టం చేశారు. అది ఓ డ్రామా.. వాళ్ళ డ్రామాలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని తెలిపారు. ఆ సమస్య పార్టీ అంతర్గత, ఫ్యామిలీ అంతర్గత సమస్య కావొచ్చు. . తెలంగాణ ప్రజలకు సంబంధం లేని అంశమని.. కవిత ఎపిసోడ్ పై ఎవరు.. ఏ పార్టీ స్పందించొద్దన్నారు.. మా పార్టీ నేతలు కూడా ఇలాంటి అంశంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు.

READ MORE: Government Survey: జనాభా పెరుగుదల.. ప్రభుత్వం ప్రత్యేక సర్వే..

అది అధికారం, ఆస్తి కోసమో జరుగుతున్న ఘర్షణ.. దాన్ని రాజకీయ, తెలంగాణ అంశంగా చూడొద్దని కిషన్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో మెర్జ్ కోసం ఎవరితో చర్చలు జరిపారో? డాడీ కేసీఆర్ బయట పెట్టాలని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆ కంపెనీలో వీరంతా డైరెక్టర్లు, వాళ్ల మధ్యలో ఆస్తుల కొట్లాట. లేక అధికార ఘర్షణ, ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొట్లాటపై మేము ఎందుకు మాట్లాడాలి? తెలంగాణ ప్రజలకు సంబంధించి విషయం వస్తే తప్పకుండా మాట్లాడుతాం..” అని కిషన్‌రెడ్డి వ్యా్ఖ్యానించారు.

READ MORE: PM Modi: ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ శత్రువులకు నిద్ర లేకుండా చేశాయి

Exit mobile version