దాయాది దేశం పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ, ప్రపంచ నాయకులు వారి "పెంపుడు జంతువుల" గురించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అందులో పరోక్షంగా పాకిస్తాన్‌ను అమెరికా పెంచి పోషిస్తున్న 'కుక్క' (పెట్)తో పోల్చారు.
కూటమి నాయకులు మట్టి, గ్రావెల్ మీద దోచుకుని లోకల్ జీఎస్టీ వేస్తున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మందు మీద అధనంగా జీఎస్టీ ఏంటి? అని ప్రశ్నించారు. ప్రతి మద్యం బాటిల్ మీద రూ.10 అదనంగా తీసుకోవడం వాస్తవం కాదా? అని నిలదీశారు. ఎమ్మెల్యే ప్రమేయం లేకపోతే అధనపు వసూళ్లు ఆపాలని డిమాండ్ చేశారు.
వైసీపీ నేతలకు వైసీపీ పార్టీ మొదటి వర్ధంతి శుభాకాంక్షలు అంటూ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఎద్దేవా చేశారు. జగన్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. జగన్ బ్రతుకే వెన్నుపోటుతో ప్రారంభించారన్నారు. కొండా సురేఖను జగన్ పట్టించుకోలేదని.. వెన్నుపోటుదారుడుగా ప్రత్యేక స్థానం జగన్ కే సొంతం అని విమర్శించారు.. చెల్లిని, తల్లిని అధికారంలోకి రాగానే బయటకు గెంటేయడం వెన్నుపోటు కాదా? అని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై కవిత ఆరోపణలు చేయడం ఏంటి? కవిత ఎందుకు జైలుకు పోయింది? వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటి? అని ప్రశ్నించారు. ఇది డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ సమస్య అని స్పష్టం చేశారు. అది ఓ డ్రామా.. వాళ్ళ డ్రామాలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని తెలిపారు.
Asaduddin Owaisi : పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అందజేసిన చిత్రపటం బహుమతిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కువైట్‌లో భారతీయ ప్రవాసులతో జరిగిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో మాట్లాడిన ఓవైసీ, పాకిస్తాన్ చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ఉద్దేశిస్తూ, “నకల్ కర్నేకే లియే అకల్ చాహియే” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కీలక పరిణామం.. 18 మంది మావోలు లొంగుబాటు “2019లో…
చంద్రబాబు నాయకత్వంలో మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.. కేవలం ఏపీలోని ప్రజలకే కాదు.. జెండా మోసిన కార్యకర్తలకు కూడా దగానాడే అని విమర్శించారు.. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. మహానాడుపై విమర్శలు గుప్పించారు.
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ ఎవరు?..జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ప్రశ్నించారు. కేటీఆర్ దమ్ముంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పదవి తెచ్చుకో అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి లాగ పీసీసి అధ్యక్షుడు అయిన రెండు సంవత్సరాలలో ముఖ్యమంత్రివి కావాలన్నారు. మీడియాతో మాట్లాడిన అద్దంకి.. బీఆర్‌ఎస్, కేటీఆర్‌ను తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డప్పుడు, ఇప్పుడు పీసీసీ అధ్యక్షులు బీసీలే అన్నారు. దమ్ముంటే తమ పార్టీలో బీసీని లేదా ఎస్సీని రాష్ట్ర…
లోక్‌సభలో వక్ఫ్ చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్, హోంమంత్రి అమిత్ షా మధ్య చర్చ జరిగింది. ఈ చర్చ నవ్వుకు దారితీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భావించే బీజేపీ తన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. పార్లమెంట్ లో సభ్యులు మొత్తం నవ్వారు. అఖిలేష్ ప్రకటనకు అమిత్ షా స్పందించి ప్రసంగం మధ్యలో లేచి నిలబడ్డారు. అఖిలేష్ యాదవ్ నవ్వుతూ ఈ విషయం చెప్పడంతో ఆయన కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇక్కడ చాలా పార్టీలు…
Akbaruddin Owaisi : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సభలో తన ప్రత్యేక శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఇచ్చే హామీలు, అవి అమలయ్యే విధానం, ప్రజలకు అందే ప్రయోజనాలను ఉద్దేశించి ఆయన ఒక ఫన్నీ స్టోరీ చెబుతూ నేరుగా ప్రభుత్వ తీరును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రసంగిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు ఫేకులు గురించి ఒక కథను వినిపించారు. ఈ కథ ప్రభుత్వాలు…