Kavitha: జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రస్తుతం మెదక్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌కి కూత వేటు దూరంలో ఉన్న మెదక్ తలసరి ఆదాయం పెరగలేదన్నారు. పాల రైతులు నష్టపోతున్నారన్నారు. మాజీ మంత్రి హరీష్‌రావుపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, ఆయన సతీమణి ప్రైవేట్ పాల వ్యాపారం పెట్టుకుని లాభాలు పొందుతున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ గురుకులాలకు పాలు పోసి లాభాలు పొందారని ఆరోపించారు. సీఎం PROగా ఉన్న అయోధ్య…
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై కవిత ఆరోపణలు చేయడం ఏంటి? కవిత ఎందుకు జైలుకు పోయింది? వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటి? అని ప్రశ్నించారు. ఇది డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ సమస్య అని స్పష్టం చేశారు. అది ఓ డ్రామా.. వాళ్ళ డ్రామాలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని తెలిపారు.