Ponnam Prabhakar: తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే నిర్వహించి శాసన సభలో చట్టం చేసి గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పంపామని.. ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మార్చి 30 నుంచి గవర్నర్ దగ్గరకు వెళ్ళిన బిల్లులు ఇంత వరకు ఆమోదం పొందలేదని తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు లేక రెండు సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం నిధులు రాక…
కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంశంపై స్పందించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీపై కవిత ఆరోపణలు చేయడం ఏంటి? కవిత ఎందుకు జైలుకు పోయింది? వాళ్లకు ఉన్న క్రెడిట్ ఏంటి? అని ప్రశ్నించారు. ఇది డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ సమస్య అని స్పష్టం చేశారు. అది ఓ డ్రామా.. వాళ్ళ డ్రామాలో తాము భాగస్వామ్యం కాదలచుకోలేదని తెలిపారు.