ఈ సంవత్సరం చివరలో జరుగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 115 మందితో బీఆర్ఎస్ తొలి జాబితాను ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్ధులను ప్రకటించిన ఆయన పనితీరు సరిగ్గా లేని ఏడుగురు సిట్టింగ్‌లకు సీట్లు ఇచ్చేందుకు నిరాకరించారు.