Nandamuri Brothers: నందమూరి అనేది ఇంటి పేరు మాత్రమే కాదు. ఇండస్ట్రీకి ఒక పునాది. ఎంతోమంది నటులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ, నందమూరి తారక రామారావు అనే పేరు మాత్రం ఇండస్ట్రీ ఎన్నేళ్లు ఉంటుందో అన్నేళ్లు నిలిచిపోతుంది. ఇక ఆ నందమూరి లెగసీని సీనియర్ ఎన్టీఆర్ కుమారులు.. వారి కుమారులు కొనసాగిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ.. నందమూరి కళ్యాణ్ రామ్.. జూనియర్ ఎన్టీఆర్.. ఇక వచ్చే తరానికి నందమూరి మోక్షజ్ఞ. ఇలా ఒక్కో తరానికి ఒక్కో హీరో వస్తూ నందమూరి పేరును కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు నందమూరి కుటుంబం నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. కొంతమంది నెగ్గుకు రాలేక వెనక్కి వెళ్లిపోయారు. ఇంకొంతమంది.. తమ తాతగారి పేరును నిలబెడుతున్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రథముడు.
Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్..
ఇక చాలా రేర్ గా నందమూరి బ్రదర్స్ ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది. బాలకృష్ణ ఉంటే ఎన్టీఆర్ ఉండడు .. కళ్యాణ్ రామ్ ఉంటే మోక్షజ్ఞ ఉండడు. కానీ, మొట్ట మొదటిసారి నందమూరి కుర్రాళ్ళు ఒకేచోట కనిపించారు. నేడు సీనియర్ ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని కొడుకు పెళ్లి జరిగింది. అందులో నందమూరి బ్రదర్స్ ఒకేచోట కనిపించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ను ఎప్పుడు అభిమానులు ఒక్కటిగానే చూస్తూ ఉంటారు. కానీ, ఈసారి ఈ అన్నదమ్ములతో పాటు తమ్ముడు కూడా యాడ్ అయ్యాడు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తెజో పాటు మోక్షజ్ఞ కలిసి కనిపించడం నందమూరి ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా కనిపిస్తుంది. ముగ్గురు ఎంతో హుందాగా, సాంప్రదాయకంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక మిలియన్ డాలర్ పిక్ అంటే ఇదే అంటూ నందమూరి ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక అన్నలిద్దరు సెట్ అయ్యారు.. తమ్ముడు కోసమే ఎదురుచూపులు అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందేమో చూడాలి.