యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త HIV నివారణ ఇంజెక్షన్‌ను ఆమోదించింది. ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇచ్చే ఈ ఇంజెక్షన్, రోజువారీ మౌత్ ప్రీ-ఎక్స్‌పోజర్ ప్రొఫిలాక్సిస్ (PrEP) కు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ ఇంజెక్షన్ ప్రపంచ HIV నివారణ వ్యూహాలకు కొత్త ఆశలను రేకెత్తించడమే కాకుండా, కొత్త HIV ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా ఉన్న భారతదేశం వంటి దేశాలకు ఆశాకిరణంగా మారనుంది.
Also Read:దీపావళి ఎందుకు జరుపుకుంటారు? పూర్తి వివరణ!
ఈ ఇంజెక్షన్‌లో కాబోటెగ్రావిర్ అనే ఔషధాన్ని ఉపయోగిస్తారు. దీనిని ప్రతి రెండు నెలలకు ఒకసారి ఇస్తారు. ఇది రోజువారీ మాత్రలకు భిన్నంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడంలో ఇబ్బంది పడే వ్యక్తులకు ఇది అనుకూలంగా ఉంటుంది. UK ప్రకారం, ప్రారంభంలో ప్రతి సంవత్సరం సుమారు 1,000 మంది దీని నుండి ప్రయోజనం పొందుతారని అధికారులు తెలిపారు. UK ఆరోగ్య కార్యదర్శి వెస్ స్ట్రీటింగ్ దీనిని 2030 నాటికి HIV ఇన్ఫెక్షన్లను అంతం చేసే “పరివర్తన” అడుగుగా అభివర్ణించారు.
Also Read:BrahMos 800km Missile: పాకిస్థాన్‌కు భారత్ అదిరిపోయే దీపావళి షాక్ .. కొత్త బ్రహ్మోస్ రానుంది!
భారతదేశం HIV నివారణలో గణనీయమైన పురోగతి సాధించింది, కానీ సవాళ్లు అలాగే ఉన్నాయి. ఈ దీర్ఘకాలిక ఇంజెక్షన్ వాటికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. అయితే, భారతదేశంలో దీనిని అమలు చేయడం అంత సులభం కాదని తెలుపుతున్నారు. ఈ ఇంజెక్షన్ ధర ఇంకా నిర్ణయించలేదు.