Pakistani Terrorists: పాక్ ఉగ్రవాదులను వేటాడేందుకు 500 కమాండోలు..
- జమ్మూకాశ్మీర్ లో భారత సైనికులపై ఉగ్రవాదుల దాడులు..
- పాకిస్తాన్ టెర్రరిస్టులను వేటాడేందుకు 500 మంది పారా కమాండోలు..
- ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న ఇండియన్ ఆర్మీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistani Terrorists: జమ్ము అండ్ కశ్మీర్‌లో ఇండియన్ ఆర్మీ సిబ్బందిపై జరుగుతున్న ఉగ్రదాడులు ఆందోళనకు దారి తీస్తున్నాయి. ఈ దాడుల్లో భారత సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. జమ్ము, రాజౌరి, పూంచ్, రియాసి, కథువా జిల్లాలు టెర్రరిస్టులకు లక్ష్యంగా చేసుకోవడంతో భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్‌లను చేపడుతున్నాయి. జమ్మూలో శిక్షణ పొందిన పాకిస్తానీ ఉగ్రవాదుల చొరబాటు దృష్ట్యా ఇండియన్ ఆర్మీ ఆ ప్రాంతంలో భారీగా మోహరించి సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఉగ్రవాదులను వేటాడేందుకు దాదాపు 500 మంది పారా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలను మోహరించినట్లు రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ చర్యలను వేగవంతం చేసేశాయి. టెర్రరిస్టులకు సపోర్ట్ ఇచ్చే వారిపై నజర్ పెట్టినట్లుగా అధికారులు తెలిపారు. పాకిస్థాన్ దురాక్రమణను ఎదుర్కోవడానికి ఇప్పటికే నాలుగు వేల మంది భద్రతా దళాలను మోహరించామని ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.
Read Also: Dog Breeding: ఇంట్లో కుక్కలను పెంచుకోవడమే కాదు.. ఇవి కూడా చేయాలి..
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
కాగా, జమ్ములో ఇటీవల జరిగిన దాడుల్లో ఉగ్రవాదులు పన్నిన గెరిల్లా యుద్ధ వ్యూహాలు, వారి దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలను బట్టి వారు సాధారణ ఉగ్రవాదులు కాదని ఇండియన్ ఆర్మీ అధికారులు తెలిపారు. వారిలో ఖచ్చితంగా కొందరు మాజీ పాక్ ఆర్మీ సైనికుల హస్తం ఉండొచ్చని ఇంటలిజెన్స్ నుంచి సమాచారం అందుతోంది. మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) డాక్టర్ ఎస్పీ వైద్ ఈ అంశం గురించి మాట్లాడుతూ.. జమ్ములో ప్రస్తుత పరిస్థితులు భయాందోళనకరంగా ఉన్నాయి.. ఈ టైంలో తక్షణం చర్యలు అవసరమని చెప్పుకొచ్చారు. కొంతమంది పాకిస్థాన్ ఆర్మీ మాజీ సైనికులు స్థానిక ఉగ్రవాద గ్రూపులకు మార్గనిర్దేశం చేస్తున్నారని తెలుస్తుందన్నారు. సోమవారం జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదులు, భారత సైనికుల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ అధికారి సహా నలుగురు ఆర్మీ సైనికులు అమర వీరులయ్యారు. మరికొందరు పోలీసులు తీవ్రంగా గాయాల బారిన పడ్డారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!