A Thief Hanging out side the Window Of Moving Train: ట్రైన్స్ లో తరచూ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఫోన్లు, పర్సులు కొట్టేస్తూ ఉంటారు. అయితే ఆ కొట్టేసిన దొంగలు దొరకడం కష్టమే. ఎందుకంటే వారు చటుక్కున కొట్టేసి లటుక్కున పారిపోతూ ఉంటారు. అయితే ఇక్కడ ఓ దొంగ అలాగే ట్రై లో పర్స్ కొట్టేయబోయి ప్యాసింజర్లకు దొరికిపోయాడు. దీంతో వారు అతనికి చుక్కలు చూపించారు. కదులుతున్న రైలులోనే అతని చేతిని పట్టుకొని కిటికీకి వేలాడదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Viral Video: అతి తెలివి చూపిన ఆటో డ్రైవర్.. తిక్క కుదిర్చిన పోలీసులు
బీహార్‌లోని బెగూసరాయ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కటిహార్ నుంచి సమస్తిపూర్ వెళ్తున్న రైలులో ఓ దొంగ మహిళ పర్స్ కిటికీలో నుంచి కొట్టేశాడు. అయితే ఇంతలో ట్రైన్ కదలడంతో అతడు కిటికీ చువ్వులు పట్టుకొని ఉండిపోయాడు. దీంతో అతడిని పట్టుకున్న ప్రయాణికులు ఎక్కడికి పారిపోకుండా అతని చేతిని గట్టిగా పట్టుకున్నారు. అయితే ఆ దొంగ మాత్రం తనని కాపాడాలని, వదిలి పెట్టాలని వేడుకున్నారు. అయిన కానీ ప్రయాణికులు అతడిని వదలకుండా గట్టిగా అలానే పట్టుకున్నారు. అలా కొన్ని కిలో మీటర్ల పాటు అలాగే దొంగను కిటికీ నుంచి గాల్లో వేలాడదీసి పట్టుకున్నారు. దీంతో ఆ దొంగకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.తరువాత కొద్దిసేపటికి రైలు బచ్వారా జంక్షన్‌లో ఆగింది. అక్కడ ఆర్పీఎఫ్ పోలీసులకు దొంగను అప్పగించారు ప్రయాణికులు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిని చూసిన చాలా మంది ఆ దొంగపై జాలి చూపిస్తున్నారు. అలా చేస్తే అతడి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని ఆందోళ వ్యక్తం చేశారు. మరి కొంతమంది దొంగతనానికి కొత్తేమో అందుకే దొరికిపోయాడు పాపం అంటూ కామెంట్ల చేస్తున్నారు.
#बेगूसराय में चलती ट्रेन से लटका चोर
सोनपुर बरौनी रेलखंड के बछवाड़ा जंक्शन के समीप एक युवक को चोरी के शक में लोगों से बचने के लिए किमी तक ट्रेन की खिड़की से लटका रहा । इसके बाद बछवाड़ा जंक्शन पहुचने पर वहां लोगों ने उतारकर उसे आरपीएफ के हवाले कर दिया। #railway #viralvideo pic.twitter.com/aFgkWQktsQ
— Ghanshyam Dev (@Ghanshyamdev3) September 2, 2023
.