అత్యధిక సిక్సర్లు బాదిన వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బంగ్లాదేశ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ బద్దలు కొట్టే అవకాశం ఉంది. కేవలం ఐదు సిక్సులు కొడితే.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టీమిండియా ఆటగాడిగా అవతరిస్తాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది.
టెస్ట్ క్రికెట్‌లో సచిన్ రికార్డును బద్దలు కొట్టగల సత్తా ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జో రూట్ కు ఉందని.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. పరుగుల కోసం ఆతృతగా ఉన్నాడని, తర్వాతి నాలుగేళ్ల పాటు పరుగులు సాధిస్తాడని పాంటింగ్ తెలిపాడు. కాగా.. రూట్ ఇటీవలే టెస్టు క్రికెట్‌లో 12000 పరుగుల మార్క్‌ను దాటిన ఏడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
బ్రియాన్ లారా తన ప్రపంచ రికార్డును బ్రేక్ చేసే ఆటగాళ్లు ఎవరు అని అడగ్గా.. అతను చెప్పిన పేర్లలో ఇద్దరు భారతీయ క్రికెటర్లు ఉన్నారు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, హ్యారీ బ్రూక్, జాక్ క్రౌలీ లాంటి ఆటగాళ్లు.. తన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టగలరని లారా తెలిపాడు.
హైతీలో సాయుధ మూకలను అదుపు చేయడం కోసం దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. హైతీ రాజధాని పోర్ట్ ఔ ప్రిన్స్‌లో ఘోరమైన నేరాలు చేసే వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలాది మంది ఖైదీలు పరారయ్యారు.
వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో కివీస్ స్టార్ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర అరుదైన ఫీట్ సాధించాడు. వన్డే వరల్డ్ కప్ సింగిల్ ఎడిషన్ లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రచిన్ రికార్డులకెక్కాడు.
Sreeleela: శ్రీలీల చిన్నపిల్లే అయినా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతుందని చెప్పవచ్చు. మిడియమ్ రేంజ్ హీరోల నుంచి బడా హీరోల వరకు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఛాయిస్ ఈ ముద్దుగుమ్మే. దాదాపు ఇప్పుడు శ్రీలీల చేతిలో పది సినిమాలకు పైగా ఉన్నాయి. ఇక రెండు సంవత్సరాల వరకు ఆమె ఖాళీగా ఉండే అవకాశమే లేదు. శ్రీలీల 2019లో కిస్ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి సారి ఆమె చూడగానే తన క్యూట్ లుక్స్ తో…
సాయంత్రం భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. మరో 24 గంటలు భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరం అని తెలిపారు. జ్వరం నార్మల్ గా ఉన్నప్పటికీ.. బాగా నీరసంగా ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ లు కూడా నార్మల్ గా ఉన్నాయన్నారు. అయితే రేపు క్లినికల్ పరీక్షల తర్వాతే పాదయాత్ర పై నిర్ణయం తీసుకోనున్నట్లు భట్టి సంబంధీకులు చెబుతున్నారు.
Anchor Suma: యాంకర్ సుమ అంటే తెలియనివారే ఉండరు. 15 ఏళ్లుగా టాప్ యాంకర్‌గా సుమ తన హవా కొనసాగిస్తోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఓ పక్క బుల్లితెరపై రాణిస్తూనే వివిధ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు యాంకర్‌గా చేస్తున్న సుమ వెండితెరపైనా తనదైన రీతిలో నటిస్తోంది. జయమ్మ పంచాయతీ సినిమాతో తనలోని మరో కోణాన్ని అభిమానులకు చాటుకుంది. చాలా మంది స్టార్ హీరోలు తమ సినిమా ఫంక్షన్‌లకు సుమ యాంకరింగ్…