మలయాళం సూపర్ స్టార్, లెజండరీ యాక్టర్ మమ్ముట్టి గురించి అందరికీ తెలుసు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.. ఈ వయస్సులో కూడా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్..
హారర్ థ్రిల్లర్ జానర్‌లో కేరళలోని చీకటి యుగాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతోన్నట్లు తెలుస్తోంది. కారడవిలో ఒక పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లే వ్యక్తి..తన చుట్టూ వినిపిస్తోన్న వింతైన సౌండ్స్.. ఆ వెనుకాల వచ్చే బిజీఎం, సస్పెన్స్ తో టీజర్ అదిరిపోయింది. గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది… 72ఏళ్ల వయస్సు గల మమ్ముట్టి.. జెడ్ స్పీడ్తో నటించే సత్తువా ఉందంటే..తనకు సినిమాపై ఉన్న మక్కువెంతో అర్ధం అవుతుంది. ఈ భ్రమయుగం మూవీని ఒట్టపాలెం, కొచి, అథిరపల్లి వంటి ప్రాంతాల్లో సినిమాను తెరకెక్కించారు..
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.. సినిమా కథ ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని సినిమా టీజర్ ను చూస్తే తెలుస్తుంది.. ఇకపోతే అర్జున్ అశోకన్, సిద్దార్థ్, భరతన్, అమల్దా లిజ్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్నాడు. మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది విడుదల కానుంది..