సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ నేత, బాక్సర్ విజేందర్ సింగ్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అనంతరం ఆయన బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
38 ఏళ్ల విజేందర్ సింగ్ 2019లో కాంగ్రెస్లో చేరారు. అనంతరం దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరి చేతిలో ఓడిపోయారు. బుధవారం బీజేపీలో చేరిన తర్వాత బాక్సర్ విజేందర్ సింగ్ మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం, ప్రజలకు సేవ చేసేందుకే తాను బీజేపీలో చేరినట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Earth: భూ ఉపరితలం కింద 700 కి.మీ. దిగువన భారీ సముద్రం.. సైంటిఫిక్ డిస్కవరీ వైరల్..
ఈసారి ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్-ఆప్ సీట్ల షేరింగ్ జరిగింది. కాంగ్రెస్ మూడు స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇప్పటికే ఆప్.. తన అభ్యర్థుల్ని ప్రకటించేశాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: Adhurs Sequel: NTR ఇంటి ముందు నిరాహార దీక్ష చేసయినా సరే Adhurs 2 చేయిస్తా!
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభమవుతుంది. అనంతరం ఏప్రిల్ 26, మే 7, 13, 20, 25, జూన్ 1న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదలకానున్నాయి. ఇక ఇప్పటికే ఆయా పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అభ్యర్థులు కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకుంది. అధికారంపై ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. మరీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో మరికొన్ని రోజులు తేలిపోనుంది.
#WATCH | Boxer & Congress leader Vijender Singh joins BJP at the party headquarters in Delhi#LokSabhaElections2024 pic.twitter.com/5fqOt9KIcp
— ANI (@ANI) April 3, 2024
#WATCH | After joining BJP, Boxer Vijender Singh says, "I have joined BJP today for the development of the country and to serve the people…"#LokSabhaElections2024 https://t.co/OCa2lP2gkc pic.twitter.com/vdgCjdGWrz
— ANI (@ANI) April 3, 2024