సాంకేతికత ప్రతిచోటా ఉంది. అభివృద్ధి, పురోగతితో లాభాలు, నష్టాలు ఉన్నాయి. సాంకేతికత చాలా మంది ఉద్యోగాలను తొలగించింది, ఉద్యోగాలను కూడా సృష్టించింది కూడా. అయితే.. కొన్ని సాంకేతికతలు అపరిష్కృతంగా ఉన్న పోలీసు కేసులకు సాక్ష్యాలను అందించడానికి ఎంతగానో దోహదపడ్డాయి. వారు మిస్సింగ్‌కు గురైన వారి గురించి సమాచారాన్ని అందించాయి, కేసులకు సాక్షులుగా ఉన్నారు. ఇలా అందరికి ఇష్టమైన గూగుల్ మ్యాప్ వృద్ధ మహిళ మిస్సింగ్ కేసులో సాక్ష్యం ఇచ్చింది.
మిస్సింగ్ కేసులో సాక్షిగా గూగుల్ మ్యాప్ : క్లూ లేదనే పాయింట్‌కి వచ్చేసరికి.. కేసును క్లోజ్ చేద్దామనుకున్నారు పోలీసులు.. ఈ సమయంలోనే.. రెండేళ్ల క్రితం అదృశ్యమైన మహిళ గురించి గూగుల్ మ్యాప్ ఇచ్చిన ఆ ఒక్క క్లూ యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది.
కథ ఏమిటి? Google Maps ఎలా సహాయపడింది? : రెండేళ్ల క్రితం అదృశ్యమైన బెల్జియంకు చెందిన వృద్ధురాలి ఉదంతం ఇది. గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఓ మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న 83 ఏళ్ల వృద్ధురాలికి పేరు పాలెట్ లాండ్రిక్స్. అయితే.. నవంబర్ 2, 2020, మధ్యాహ్నం 1 గంటల సమయంలో, ఆమె భర్త బట్టలు ఉతుకుతుండగా.. ఇంట్లో నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది పాలెట్. అయితే.. ఆమె వెళ్లిన విషయం ఆమె భర్తకు తెలియదు, దీంతో.. మధ్యాహ్నం తర్వాత తన భార్య అక్కడ లేకపోవడం గమనించాడు.
అనంతరం ఇరుగుపొరుగు వారందరినీ ఆరా తీయగా ఎక్కడా కనిపించకపోవడంతో భార్య మిస్సింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2020లో, పాలెట్ లాండ్రిక్స్ మిస్ అయింది, కానీ రెండేళ్లపాటు ఆమె గురించి ఎలాంటి క్లూ దొరకలేదు. దీంతో పోలీసులు ఆమె కేసును అక్టోబర్ 2022లో ముగించారు. అయితే ఈలోగా ఆనాటి గూగుల్ మ్యాప్ చూసుకోవాలని ఓ అధికారి సూచించారు. ఎందుకంటే.. 2020 నవంబర్ 2న గూగుల్ స్ట్రీట్ వ్యూకు చెందిన వాహనం ఆ ఊరిలోని మ్యాప్స్‌ను ఆప్డేట్ చేసిందని తెలుసుకున్నా పోలీసులు.. గూగుల్ స్ట్రీట్ వ్యూలో పాలెట్ ఇంటి కోసం వెతకడం ప్రారంభించారు. అక్కడ గూగుల్ స్ట్రీట్ వ్యూలో పాలెట్ వీధి దాటుతున్న దృశ్యాన్ని గుర్తించారు.
Pallavi Prasanth : అమ్మకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన రైతు బిడ్డ.. ధర ఎంతో తెలుసా?
ఈ ఒక్క సాక్షి దొరికిన తర్వాత మళ్లీ కేసు పెట్టి మిస్సింగ్ కేసును ఛేదించడం మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్లూని ఆధారంగా చేసుకొని, వారు ఇరుగుపొరుగు వారి గురించి మరియు సమీపంలోని రోడ్ల గురించి విచారించారు. చివరకు ఆమెను కనుగొన్నారు. కానీ దురదృష్టవశాత్తు పాలెట్ లాండ్రిక్స్ సజీవంగా కాకుండా చనిపోయింది. కొండ దిగువన పాలెట్ లాండ్రిక్స్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించగా.. ఎత్తు నుంచి కిందపడి మృతి చెందినట్లు తేలింది. ఆమె అల్జీమర్స్ కారణంగా అకాల మరణం చెందిందని రిపోర్టులో పేర్కొన్నారు.
అయితే.. నలుగురు పిల్లల తల్లి అయిన పాలెట్ అల్జీమర్స్ కారణంగా తప్పిపోయి చాలాసార్లు వీధుల్లో తిరిగారు. తప్పిపోయిన భార్య కోసం ఆమె భర్త గతంలో చాలాసార్లు వెతికి ఇంటికి తీసుకొచ్చాడు. చిల్లింగ్ స్కేర్స్ ఛానెల్ షేర్ చేసిన “6 మోస్ట్ డిస్ట్రబింగ్ మిస్టరీస్ సాల్వ్డ్ విత్ గూగుల్ మ్యాప్స్” అనే శీర్షికతో యూట్యూబ్ వీడియోలో ఈ కేసు షేర్ చేయబడింది.
Love Marriage : వరుడికి 100 ఏళ్లు, వధువుకు 96 ఏళ్లు! వచ్చే నెలలో వీరి ప్రేమ వివాహం!