ప్రభుత్వం ఉద్యోగులకు కేంద్రం ఎప్పటికప్పుడు రూల్స్ మారుస్తున్న విషయం తెలిసిందే..డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సొనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) తాజాగా కీలకమైన స్పష్టత ఇచ్చింది.. ఎల్‌టీసీకి సంబంధించిన కొత్త రూల్స్ అంశంపై క్లారిటీ తీసుకువచ్చింది. ఎల్‌టీసీ కింద ట్రైన్ జర్నీ, ఎల్‌టీసీకి సంబంధించి ఎయిర్ టికెట్లు బుకింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. 7వ వేతన సంఘం కింద జీతం తీసుకుంటున్న ఉద్యోగులకు ఈ రూల్స్ వర్తిస్తాయి..
సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1988 కింద ఎల్‌టీసీ రూల్స్ వర్తిస్తాయి. డీఓపీటీ ఈ మేరకు ఆఫీస్ మెమరాండమ్ జారీ చేసింది. ఇకపై ఉద్యోగులకు లీవ్ ట్రావెల్ కన్షీషన్ కింద బుక్ చేసుకున్న టికెట్లపై కేటరింగ్ చార్జీలను రీయింబర్స్‌మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇండియన్ రైల్వేస్ ప్రయాణికులకు కేటరింగ్ ఫెసిలిటీ పొందాలా? వద్దా? అనే అంశానికిసంబంధించి ఆప్షన్ కల్పిస్తోంది.. ఉద్యోగులు టికెట్ బుకింగ్ సమయంలో ఈ ఆప్షన్ ను ఎందుకుంటే ఎల్‌టీసీ కింద కేటరింగ్ చార్జీలను రీయింబర్స్‌మెంట్ పొందొచ్చు..
ఎయిర్‌లైన్స్ విధించే క్యాన్సలేషన్ చార్జీలు, అలాగే మూడు ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్లు (ఐఆర్‌సీటీసీ, బీఎల్‌సీఎల్, ఏటీటీ).. వారి ప్లాట్‌ఫామ్ వినియోగించుకోవడం వల్ల వసూలు చేసే క్యాన్సలేషన్ చార్జీలను రీయింబర్స్ చేసే వెసులుబాటు కూడా ప్రభుత్వం అందిస్తోంది. దీని వల్ల ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కొత్త రూల్స్ ఈ నెల నుంచే అమలులోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది.. ఇకపోతే ఉద్యోగులకు మరోవైపు డీఏ జీతాల పెంపు 4 శాతం ఉంటుందని అంటున్నారు.. ఇదే జరిగితే ఉద్యోగులకు డీఏ 46 శాతానికి చేరొచ్చు. దీని వల్ల ఎంప్లాయీస్‌కు వేతనాలు కూడా పెరగనున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు సార్లు డీఏను పెంచుతుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకాసారి, అలాగే జూలై నుంచి డిసెంబర్ కాలానికి మరోసారి డీఏ పెంపు ఉంటుంది. ఇలా డీఏ పెరగడం వల్ల ఉద్యోగులకు వేతనాలు కూడా పైపైకి చేరుతాయి. అంతేకాకుండా ఉద్యోగులకు హెచ్ఆర్ఏ కూడా పెరగొచ్చనే అంచనాలు ఉన్నాయి.. ఇది నిజమైతే ఉద్యోగులకు జీతాలు మరింత పెరుగుతాయని అంచనా..