Bondi Beach Shooting: సిడ్నీలో నేడు (జనవరి 4, ఆదివారం) జరిగిన ఐదో యాసిస్ టెస్టు మ్యాచ్ సందర్భంగా.. బాండీ బీచ్‌లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనకు స్పందించి ప్రాణాపాయాన్ని లెక్కచేయకుండా సేవలందించిన అత్యవసర సేవా సిబ్బంది, పౌరులకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు ఘనంగా సన్మానించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు మైదానంలో ఏర్పాటు చేసిన గార్డ్ ఆఫ్ ఆనర్ సందర్భంగా.. పూర్తిగా నిండిన ప్రేక్షకుల నుంచి గట్టిగా చప్పట్లు మారుమోగాయి. ముఖ్యంగా దాడి చేసిన వ్యక్తుల్లో ఒకరి వద్ద నుంచి తుపాకీని లాక్కొని అడ్డుకున్న వీరుడు ‘అహ్మద్ అల్ అహ్మద్’ మైదానంలోకి వచ్చినప్పుడు స్టేడియంలో మొత్తం ప్రజలు చప్పట్లతో అతనికి స్వాగతం పలికారు.
FIFA World Cup 2026 స్పెషల్ ఎడిషన్ Motorola Razr.. జనవరి 6న గ్రాండ్ లాంచ్‌కు సిద్ధం..!
డిసెంబర్ 14న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు సమీపంలోని బాండీ బీచ్‌లో నిర్వహించిన హనుక్కా కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని తండ్రికొడుకులు సాజిద్ అక్బర్, నవీద్ అక్బర్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా డజన్ల సంఖ్యలో గాయపడ్డారు. దీనిని అధికారులు యూదుల వ్యతిరేక ఉగ్రవాద దాడిగా పేర్కొన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ టాడ్ గ్రీన్‌బర్గ్ ఈ ఘటనను “ఒక విషాదం”గా అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో అంబులెన్స్ సిబ్బంది, పోలీస్ అధికారులు, సర్ఫ్ లైఫ్‌సేవర్లు, యూదుల సమాజ ప్రతినిధులు తదితరులను గౌరవించారు. టెస్టు మ్యాచ్ సందర్భంగా.. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. యూనిఫాం ధరించి గుర్రాలపై ఉన్న పోలీసులు, పబ్లిక్ ఆర్డర్ అండ్ రియట్ స్క్వాడ్ సిబ్బంది మైదాన పరిసరాల్లో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇవే విధమైన భద్రతా చర్యలు మెల్‌బోర్న్‌లో జరిగిన ‘బాక్సింగ్ డే టెస్టు’లోనూ అమలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Heroes ❤️
A privilege and honour to host the first responders responsible for displayed tremendous bravery during the Bondi Beach terrorist attack. pic.twitter.com/Q9WdgsKVHc
— Cricket Australia (@CricketAus) January 4, 2026