టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడిలో ఈ నెల 14న బేగం బజార్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కాబడ్డ బీజేవైఎం నేతలకు నాంపల్లి కోర్టు షరతులతో బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. బీజేవైయం నేతలు విడుదల సందర్భంగా జైలు వద్దకు బీజేపీ పార్టీ నేతలు, బీజేవైయం కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుని, విడుదలైన నేతలకు స్వాగతం పలికి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంకు భారీ ర్యాలీగా వెళ్లారు. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read : Dahi Controversy: తమిళనాడులో “దహీ” వివాదం.. పెరుగు ప్యాకెట్లపై హిందీ పేరు ఉండొద్దన్న సీఎం
ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ మాట్లాడుతూ.. సిట్ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే ఉంటుంది. అందుకే సీబీఐ ,సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని,టి ఎస్ పీ ఎస్ సి చైర్మన్ జనార్దన్ రెడ్డి మొదలు కొని, మంత్రి కే టీ ఆర్, సీఎం కేసీఆర్ ను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వల్ల విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రులు కోటి మంది ఆందోళన కు గురయ్యారని, వారందరికీ న్యాయం జరిగే వరకు బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Also Read : Off The Record: శంకర్ నాయక్.. స్టయిలే వేరు!