Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఒకేతాను ముక్కలే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: వ్యవసాయ రంగానికి, రైతు సమాజానికి గౌరవం కలిగించే విధంగా మోడీ సర్కారు కార్యక్రమాలు చేపడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. మాటల్లో కాకుండా చేతల్లో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఎరువుల రిటైల్ షాప్స్ రేపటి(27 వ తేదీ) నుంచి ప్రధాన మంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, ఇతర సేవలు పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు. రైతులకు కావాల్సిన అన్ని సేవలను ఒకేచోట కల్పించేందుకు ఎరువుల రిటైల్ షాపులను ఈ కేంద్రాలుగా మారుస్తున్నామని పేర్కొన్నారు. ప్రధాని మొదటి దశలో రేపు ఒక లక్షా 25వేల షాపులను ప్రారంభిస్తారని తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హైదరాబాద్‌లో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పలు కీలక విషయాలు వెల్లడించారు.
Also Read: Hyderabad Woman: యూఎస్‌లో ఆకలితో తెలంగాణ యువతి.. విదేశాంగ మంత్రికి లేఖ రాసిన తల్లి!
Also Read
- Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Nepal Floods: నేపాల్ వరదల్లో ఏపీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం.. భర్త ఆచూకీ కోసం భార్య ఆవేదన!
సల్ఫర్ కోటెడ్ యూరియా రేపటి నుండి అందుబాటులోకి వస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. భారత్ బ్రాండ్ పేరుతో రేపటి నుండి ఎరువులు అందుబాటులో ఉంటాయన్నారు. అన్నదాతలకు కావాల్సిన అన్ని సేవలను ఒకే చోట కల్పించేందుకు ఎరువుల రిటైల్ దుకాణాలను ప్రధానమంత్రి కిసాన్ సేవా కేంద్రాలుగా మారుస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ కేంద్రాలను రేపు ప్రధాని మోడీ రాజస్థాన్‌లో ప్రారంభిస్తారన్నారు. నాణ్యమైన ఎరువులు, విత్తనాలు నిర్దేశిత ధరలతో ఈ సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. అదేవిధంగా ఈ పీఎం కిసాన్ సేవా కేంద్రాల్లో భూసార పరీక్షలు, విత్తన పరీక్షలు నిర్వహిస్తారన్నారన్న కిషన్ రెడ్డి.. వ్యవసాయానికి కావాల్సిన పరికరాల అమ్మకాలు, కిరాయికి ఇక్కడ అందుబాటులో ఉంటాయని తెలిపారు.
Also Read: Viral Video: అవిశ్వాస తీర్మానాన్ని ఆనాడే ఊహించిన మోడీ.. 2019 నాటి వీడియో వైరల్
రేపు 14వ విడత కిసాన్ సమ్మాన్ నిధులను ప్రధాని రైతుల ఖాతాల్లో జమ చేస్తారని.. గురువారం రోజున 8.5 కోట్ల రైతుల ఖాతాల్లో రూ. 17,500 కోట్లు ప్రధాని జమ చేస్తారని కిషన్ రెడ్డి పేర్కొన్నాయి. తెలంగాణలోని 39లక్షల మంది రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ డబ్బులు జమకానున్నాయని ఆయన వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడా ఎరువుల కొరత లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ‘ఒకే దేశం-ఒకే ఎరువు’ నినాదంతో భారత్ బ్రాండ్ పేరుతో రేపటి నుంచి అమలులోకి వస్తుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒక్కతాను ముక్కలేనన్న కిషన్ రెడ్డి.. గతంలో కలిసి పని చేశారని, భవిష్యత్‌లోనూ కలిసి పని చేస్తారని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు కుటుంబ, అవినీతి పార్టీలన్న ఆయన.. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా మూడు పార్టీలు అనేక సార్లు తెలంగాణను పరిపాలించాయన్నారు. బీఆర్ఎస్ కారు స్టీరింగ్ ఎంఐఎం దగ్గర ఉందన్నారు. తెలంగాణలో మార్పు రావాలంటే బీజేపీనే సాధ్యమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
-
Nikitha Godishala: యూఎస్ లో మాజీ ప్రియురాలి హత్య కేసు.. ఆగ్రాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్ట్
-
Geetu Mohandas : అసలు ఏం చెప్పాలనుకుంది? ఏం చెప్పింది?
-
Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
-
Honor 600S 5G: 8100mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor 600S 5G.. Snapdragon చిప్, Android 16తో కొత్త ఫోన్
ట్రెండింగ్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్‌కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!