NCERT: 9వ తరగతి సిలబస్‌లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- NCERT కీలక నిర్ణయం..
- 9వ తరగతి సిలబస్‌లో మార్పులు..
- ఫ్రెంచ్, రష్యా విప్లవాల తొలగింపు..
- వేదాలు, మహాజనపదాలకు ప్రాధాన్యం..
- వర్ణ వ్యవస్థ, మహిళల పాత్రపై సిలబస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NCERT: 9వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్య పుస్తకాన్ని NCERT సవరించింది. సవరించిన పుస్తకంలో ఫ్రెంచ్ విప్లం, రష్యా విప్లవం, నాజీయిజం ఎదుగుదల వంటి ప్రపంచ చరిత్రకు సంబంధించిన అధ్యాయానాలు తొలగించింది. వీటిని ఇకపై 10వ తరగతిలో పాఠ్యాంశాలుగా బోధించనున్నారు. దీనికి బదులుగా భారతీయ చరిత్ర, నాగరికత, జ్ఞాన వ్యవస్థలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కొత్త పుస్తకంలో ‘‘అండర్స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’’ అనే అధ్యాయం ద్వారా మానవ పరిణామ క్రమం, వేటాడే జీవితం నుంచి వ్యవసాయం వరకు జరిగే మార్పులు, మెసపటోమియా, హరప్పా, ఈజిప్ట్, చైనా నాగరికతలకు వివరించింది.
ఇదే కాకుండా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం వంటి నాలుగు వేదాల పరిచయం, వారి ముఖ్య ఉద్దేశాలను కూడా విద్యార్థులకు తెలియజేసేలా సిలబస్ రూపొందించారు. వర్ణ, జాతి వ్యవస్థల పరిణామం గురించి ప్రత్యేక అధ్యాయం చేర్చారు. ప్రారంభ వైదిక కాలంలో సామాజిక హోదా పుట్టుక ఆధారంగా కాకుండా వృత్తి, ప్రాంతం, భాష, కుటుంబ సంబంధాల వంటి అనేక అంశాలపై ఉండేదని పేర్కొంది. వృత్తుల్లో కూడా అప్పటి వారసత్వం స్థిరపడలేదని వివరణ ఇచ్చారు.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
క్రీస్తుపూర్వం 6వ-4వ శతాబ్ధాల మధ్య భారతదేశంలోని వెలుగొందిన 16 మహాజనపదాల గురించి కొత్త సిలబస్‌లో చోటు కల్పించారు. వైదిక కాలంలో మహిళల విద్యా, పాండిత్యం గురించి ప్రస్తావించారు. కొత్త సిలబస్‌లో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం వంటి పంచ భూతాల భారతీయ తాత్విక భావనల్ని పరిచయం చేశారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం, మహాభారతం వంటి భారతీయ గ్రంథాల ప్రస్తావనను కూడా చేర్చారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!