Trump: ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ కునుకు.. వీడియో వైరల్
- ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ కునుకు
- క్రైస్తవ నాయకులతో ఉన్నప్పుడు ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. వైట్‌హౌస్‌లో జరిగిన ఓవల్ ఆఫీస్ సమావేశంలో ట్రంప్ కొద్దిసేపు కునుకు తీసినట్లు కనిపించే వీడియో వైరల్ కావడంతో మరోసారి పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అయితే ఈ ప్రచారాన్ని వైట్‌హౌస్ ఖండిస్తూ.. ట్రంప్ ఇప్పటికీ ‘‘అమెరికా చరిత్రలోనే అత్యంత చురుకైన, ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండే అధ్యక్షుడు.’’ అని స్పష్టం చేసింది.
వైట్‌హౌస్‌లోని రిలిజియస్ లిబర్టీ కమిషన్ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రధానంగా సంప్రదాయవాద క్రైస్తవ నాయకులతో కూడిన ఈ కమిషన్.. చర్చి-ప్రభుత్వాల మధ్య ఉన్న సంప్రదాయ విభజనను తగ్గించి, మత సంస్థలు-ప్రభుత్వం మధ్య మరింత సమన్వయం ఉండేలా ప్రతిపాదనలపై చర్చిస్తోంది. అయితే సమావేశానికి సంబంధించిన వీడియోల్లో ట్రంప్ కొద్దిసేపు కళ్లుమూసుకుని కూర్చున్నట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. టెక్సాస్ లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ ప్యాట్రిక్ మాట్లాడుతున్న సమయంలో ట్రంప్ కొద్దిసేపు కళ్లుమూసుకుని కనిపించారు. మరో వీడియోలో మరో సభ్యుడు మాట్లాడుతుండగా ట్రంప్ ఒక్కసారిగా తల పైకెత్తినట్లు కనిపించింది.
Also Read
- Trump-Iran: మధ్యంతర ఎన్నికల వేళ ట్రంప్ ప్రత్యేక సమావేశం.. ఇరాన్ యుద్ధంపై కీలక ప్రకటన చేసే అవకాశం
- Strait of Hormuz: హోర్ముజ్ నుంచి యెమెన్ వరకు హైటెన్షన్.. 86 షిప్స్‌కు అమెరికా బ్రేక్!
- Turkey-SCO: ‘ఎస్సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!
- US: పౌరసత్వంపై ట్రంప్ కఠిన వైఖరి.. పిల్లల పాస్‌పోర్ట్‌కు తల్లిదండ్రుల ఆధారాలు మెలిక?
ఈ వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందనలు వచ్చాయి. కొందరు ‘‘ట్రంప్ మళ్లీ సమావేశంలో నిద్రపోయారా?’’ అంటూ వ్యాఖ్యానించగా.. మరికొందరు ‘‘వైట్‌హౌస్ సిబ్బంది అధ్యక్షుడిని లేపాల్సింది’’ అంటూ వ్యంగ్యంగా పోస్టులు చేశారు. గత మే నెలలో కూడా ఇలాంటి ఘటన వెలుగులోకి రాగా.. అప్పుడు ట్రంప్ నిద్రపోలేదని, కేవలం ఎక్కువసేపు కళ్లుమూసుకుని ఉన్నారని వైట్‌హౌస్ వివరణ ఇచ్చింది. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మరో సమావేశంలో కూడా ట్రంప్ కునుకు తీస్తున్నట్లు కనిపించిన వీడియో వైరల్ అయింది.
వైట్‌హౌస్ ఏమంది?
ఈ ఘటనపై స్పందించిన వైట్‌హౌస్ ప్రతినిధి డేవిస్ ఇంగిల్.. ట్రంప్‌పై వస్తున్న విమర్శలను పూర్తిగా కొట్టిపారేశారు. ‘‘అధ్యక్షుడు ట్రంప్ చురుకుదనం, అసాధారణ శక్తి, ప్రజలకు అందుబాటులో ఉండే తీరు గత ప్రభుత్వంతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంది. గత పాలనలో మాజీ అధ్యక్షుడు బైడెన్ మానసిక, శారీరక ఆరోగ్య క్షీణతను డెమోక్రాట్లు, కొన్ని మీడియా సంస్థలు అమెరికా ప్రజల నుంచి దాచిపెట్టాయి. కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం నిరంతరం పనిచేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారు. ట్రంప్ అమెరికా చరిత్రలోనే అత్యంత చురుకైన, ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండే అధ్యక్షుడు.’’ అని ఇంగిల్ పేర్కొన్నారు.
అయితే వైట్‌హౌస్ ఈ ఆరోపణలను ఖండించినప్పటికీ.. వైరల్ వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ట్రంప్ నిజంగానే కొద్దిసేపు కునుకు తీశారా? లేక కేవలం కళ్లుమూసుకుని ఉన్నారా? అనే అంశంపై నెటిజన్ల మధ్య చర్చ కొనసాగుతోంది.
Trump fell asleep again!!
There is no denying this one. pic.twitter.com/xvUWrW9h28
— Brian Krassenstein (@krassenstein) June 27, 2026
- Tags
- Donald Trump
- Oval Office
- trump
- us
తాజావార్తలు
-
Puri Jagannath: పూరీ ఆలయ నిధుల లెక్కలు వెల్లడి.. జగన్నాథ స్వామి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా..?
-
El Nino: 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో.. 100% కొనసాగుతుందని WMO హెచ్చరిక
-
Konda Surekha : గతంలో పార్టీని తిట్టిన వారిపై చర్యలేవి.? కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు
-
PM Modi: కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్’ ప్రత్యక్ష పఠనాన్ని వీక్షించిన మోడీ.. ప్రత్యేకత ఏంటి?
-
Ram Mandir CEO: రామ మందిర్ CEOగా జితేంద్ర మిశ్రా.. ‘ఆపరేషన్ సింధూర్‌లో రహస్యం ఉందా?’ కాంగ్రెస్ అనుమానం
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!