NTV Telugu Site icon

BJP: డీ లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం.. బీజేపీ నాయకుల స్పందన

Cm Revanth

Cm Revanth

సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో డీ లిమిటేషన్‌పై తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన ప్రసంగించారు. పునర్విభజన పారదర్శనకంగా జరగాలన్నారు. “జనాభా నియంత్రణ శాపం కాకూడదు. జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుని నియోజక వర్గ పునర్విభజన చేయాలి. వాజ్ పేయి కూడా పునర్విభన 25 ఏళ్లు వాయిదా వేశారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల పునర్విభజన చేయాలని ఆలోచన సరికాదు. కేంద్రమే నిర్ణయం తీసుకోలేదు అని కేంద్ర మంత్రి అంటున్నారు. కేంద్రానికి .. తెలంగాణ సభ నుండి తీర్మానం చేసి పంపాలని నిర్ణయం తీసుకున్నాం.” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.

READ MORE: 10th Exam Paper Leak: కేటీఆర్‌పై కేసులు పెట్టడం ఏంటి.. లీకేజీకి కారకులెవ్వరు?: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌

ఈ తీర్మానంపై బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ స్పందించారు. “శాసన సభలో ముఖ్యమంత్రి నియోజకవర్గాల పునర్విభజనపై తీర్మానం ప్రవేశ పెట్టాడు.. దాని పై చర్చ చేస్తాం అంటే అవకాశం ఇవ్వడం లేదు.. డీ లిమిటేషన్ పై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కలిసి పోరాటం చేస్తామని అంటున్నారు.. ఇప్పుడు కొత్తగా కలవడం ఏంటి..? కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎప్పుడో కలిసిపోయాయి.. మొన్న చెన్నైలో ఇరు పార్టీలు వెళ్లి స్టాలిన్ వీపు గోకి వచ్చారు.. స్టాలిన్‌కు వీపు దురద పెట్టడానికి కారణం ఉంది.. వచ్చే కొద్ది రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి స్టాలిన్ డీ లిమిటేషన్ పై చర్చ పెట్టాడు.. కానీ మన రాష్ర్టంలో ఎన్నో సమస్యలు ఉంటే ఇక్కడ పని చేయడం మానేసి స్టాలిన్ వీపు గోకడానికి వెళ్ళారు.. డీ లిమిటేషన్ ఎవరికీ తెలియకుండా ఏమైనా చాటుగా చేస్తారా? డీ లిమిటేషన్ వల్ల ఏదో నష్టం జరగబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.. వారి పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని పక్క దారి పట్టించేందుకు మోడీపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.. బీజేపీ పార్టీకి దేశంలోని అన్ని ప్రాంతాలు సమానమే.. అన్ని ప్రాంతాల్లో ప్రజలు మాకు సమానమే.. ఎక్కడా కూడా ఎలాంటి నష్టం ఉండబోదని కేంద్ర మంత్రులు బహిరంగంగా చెబుతున్నారు.. జిల్లాలను విభజించిన విషయం బీఆర్ఎస్ మరిచి పోయింది..” అని పాయల్ శంకర్ స్పష్టం చేశారు. మిగతా బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించారు.