అగ్ర రాజ్యం అమెరికాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫ్లోరిడాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతులు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండలం టేకులపల్లికి చెందిన ప్రణీతరెడ్డి (35), ఆమె కుమారుడు అరవింద్ (6), ఆమె అత్త సునీత (56)గా గుర్తించారు. భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ…
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటి పై దాడిని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు. ఈ దాడికి ప్రధాన కారణమైన ఎమ్మెల్సీ కవితపై కూడా పోలీసులు కేసు నమోదు చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ నగరంలో రద్దీ ప్రాంతాల్లో పాదచారులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను అందుబాటులోకి తెస్తుంది. పాదచారులను ఆకర్షించేలా ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే నగరంలో పలు చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే పంజాగుట్ట హైదరాబాద్ సెంట్రల్ మాల్ వద్ద ఏర్పాటు చేసిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇవాళ జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి ప్రారంభించనున్నారు. ఈ బ్రిడ్జిని ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. మొత్తం వుడెన్ కలర్‌తో రూపొందించిన ఈ…