Vishnu Kumar Raju: ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర.. సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరగాలి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vishnu Kumar Raju: విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కొడుకు, ఆడిటర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది.. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కేసును ఛేదించారు.. నిందితులను అరెస్ట్ చేశారు.. కిడ్నాప్‌నకు గురైనవారు అంతా సేఫ్ గా వచ్చేశారు.. అయితే, ఈ కేసులో సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు.. ఎంపీ కుటుంబం కిడ్నాప్ కేసులో కుట్ర దాగి ఉందన్న ఆయన.. ఈ కేసును సీబీఐ, ఎన్‌ఐఏతో విచారణ జరిపించాలని కోరారు.. ఎంపీ కుటుంబం కిడ్నాప్ ఆశ్చర్యానికి గురి చేసిందన్న ఆయన.. ఎంపీ ఇంటికి ఒక ఆకు రౌడీ వెళ్లాడంటే సాధారణమైన విషయం కాదు.. దీని వెనుక పెద్ద కుట్ర దాగి వుందనే అనుమానం కలుగుతోందన్నారు.. సినిమా స్టోరీని మించిన నిజంగా జరిగిన ఘటన ఇది.. ఈ ఘటన వెనుక ఎంపీ బయటకు చెప్పుకోలేని విషయాలు దాగి ఉన్నాయి అన్నారు. భార్య, కుమారుడు ఎక్కడ ఉన్నారో ఎంవీవీ ఎందుకు గమనించలేదని అంతుబట్టని విషయమన్న ఆయన.. ఎంపీ కొడుకు ఫోన్ చేస్తే.. రోజు స్టేషన్ కు రావాల్సిన రౌడీషీటర్ కదలికలను వదిలేస్తారా..? అని ప్రశ్నించారు.
Read Also: Minister KTR: ఖిలావరంగల్ లో కేటీఆర్.. ఐడీఓసీ నిర్మాణానికి శంకుస్థాపన
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
విశాఖలో అరాచక శక్తులు తిరుగుతున్నాయని స్వయంగా కేంద్ర హోం మంత్రి హెచ్చరించారని గుర్తుచేశారు విష్ణుకుమార్ రాజు.. అది జరిగిన రెండు రోజుల్లోనే ఎంపీ కుటుంబం బాధితులుగా మారాన్న ఆయన.. గంజాయి మత్తులో జరిగిన అరాచకం గురించి తెలుసుకుని నివ్వెరపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.. ఎంపీ ఫ్యామిలీకి ఇబ్బంది కలిగితే ప్రతిపక్ష పార్టీలు సంబరాలు చేసుకుంటున్నారని వైసీపీ నాయకులు దిక్కుమాలిన మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.. ఇక, ఈ వ్యవహారంలో కడప, పులివెందుల బ్యాచ్ లు ఉన్నాయనే ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.. సెల్ ఫోన్ డేటా బయటకు తీస్తే మొత్తం వ్యవహారం బయటకు వస్తుందని సూచించారు.
Read Also: PM Modi America Visit: అమెరికాలో ప్రధాని మోడీ పేరుతో కారు నంబర్ ప్లేట్
ఇక, ఈ కేసులో ఏపీ పోలీసులు నిస్పాక్షిక విచారణ జరుపుతారన్న నమ్మకం లేదన్నారు విష్ణుకుమార్ రాజు.. నిజాలు తేలాలంటే థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరప్రదేశ్ మోడల్ పోలీసింగ్ అమలు చేస్తేనే అరాచకాలు తగ్గుతాయని సూచించారు. ఇది కిడ్నాప్ కాదు.. సెటిల్ మెంట్ వ్యవహారం అనేది మా అభిప్రాయంగా పేర్కొన్నారు. ఇచ్చుపుచ్చుకునే దగ్గర తేడాలా..? లేక ఇతర కారణాలా..? అనేది విచారించాలని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. కాగా, ఎంపీ ఫ్యామిలీ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.. ఇప్పటికే నిందితులను అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు.
తాజావార్తలు
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్‌ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!