Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jr NTR: సాంకేతికత వికృత రూపం దాల్చి మహిళల ఆత్మగౌరవాన్ని బజారుకీడుస్తున్న తీరుపై మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవర చిత్రంలోని చార్ట్‌బస్టర్ సాంగ్ ‘చుట్టమల్లే’ను అడ్డం పెట్టుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీతో కొందరు వికృత చేష్టలకు పాల్పడటంపై ఆయన సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. అత్యంత దిగజారుడు తనంతో మహిళలను కించపరిచేలా మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించిన వారిపై విరుచుకుపడుతూ, “మిమ్మల్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ అల్టిమేటం జారీ చేశారు. ‘చుట్టమల్లే’ పాటను అసభ్యకర రీతిలో ఏఐ ద్వారా మార్ఫ్ చేసి నెట్టింట వైరల్ చేసిన కీచకులపై సోషల్ మీడియా వేదికగా తారక్ చేసిన పోస్ట్‌లో వాడిన పదజాలం చూస్తే ఆయన ఎంతటి ఆవేదనకు, ఆగ్రహానికి గురయ్యారో స్పష్టంగా అర్థం అవుతుంది.
“అసహ్యకరం.. రోత పుట్టించే సిగ్గుమాలిన చర్య ఇది! స్త్రీలను తల్లులుగా, దేవతలుగా పూజించే నేల మనది. ‘మాతృదేవోభవ’ అనేది కేవలం మాట కాదు, మన సంస్కృతిలో భాగం. అలాంటి పవిత్రమైన గడ్డపై మహిళను ఇంత దారుణంగా కించపరిచేందుకు ఏఐ టెక్నాలజీని వాడుతూ కొందరు ఇంత నీచానికి దిగజారడం మాటల్లో చెప్పలేనంత సిగ్గుచేటు. ఈ మార్ఫ్ చేసిన ‘చుట్టమల్లే’ వీడియో వెనుక ఉన్న నీచుల్లారా.. మీలో ఒక్కడినీ వదిలిపెట్టను! ఈ వీడియోను క్రియేట్ చేసిన వారిపై, దీనిని సర్క్యులేట్ చేస్తూ వైరల్ చేస్తున్న వారిపై సాధ్యమైన ప్రతి చట్టపరమైన చర్యలూ తీసుకుంటా!” అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఇలాంటి వికృత కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని నెటిజన్లను ఎన్టీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ మార్ఫింగ్ వీడియోలను చూడటం, ఇతరులకు షేర్ చేయడం లేదా వాటితో ఎలాంటి ఎంగేజ్మెంట్ పెట్టుకోవడం తక్షణమే ఆపేయాలని కోరారు.
Also Read
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
- Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! 'జై హనుమాన్' అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
- Akshara Haasan: "టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా".. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
“ఈరోజు ఎవరో ఒక మహిళ బాధితురాలు కావొచ్చు.. కానీ రేపు మీ స్వంత తల్లి, చెల్లెలు, భార్య లేదా కూతురు కూడా ఈ వికృత పోకడల బారిన పడొచ్చు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి” అంటూ ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించేలా తారక్ చురకలు అంటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో పెచ్చురిల్లుతున్న డిజిటల్ నేరాలను అరికట్టేందుకు వ్యవస్థ కఠినంగా స్పందించాల్సిన సమయం వచ్చిందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి తక్షణమే అత్యంత కఠినమైన చట్టాలు, నిబంధనలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆయన గట్టిగా కోరారు. సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికే కాకుండా సాధారణ మహిళల భద్రతకు కూడా పెనుముప్పుగా మారిన డీప్‌ఫేక్, ఏఐ మార్ఫింగ్ టెక్నాలజీలపై జూనియర్ ఎన్టీఆర్ నేరుగా రంగంలోకి దిగి వార్నింగ్ ఇవ్వడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.
Disgusting, Sick and Shameless.
In a land that worships women as mothers and goddesses, where "Matrudevo Bhava" is not just a phrase but a part of our culture, some people have fallen so low that they are using AI to disrespect a woman in the most degrading way possible. Using…
— Jr NTR (@tarak9999) October 3, 2026
తాజావార్తలు
-
Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
-
Petrol Diesel Price Hike: వాహనదారులకు షాక్.. పెట్రోల్ రూ.5, డీజిల్ రూ.3 పెంపు
-
Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
-
Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
-
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!