Minister KTR: ఖిలావరంగల్ లో కేటీఆర్.. ఐడీఓసీ నిర్మాణానికి శంకుస్థాపన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister KTR: వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. గీసుకొండ మండలం శాయంపేటలో గల కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్ కంపెనీ ఎవర్ టాప్ టెక్స్‌టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వస్త్ర పరిశ్రమల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమిపూజ అనంతరం పార్కులో టెక్స్ టైల్ పరిశ్రమలు నిర్మిస్తున్న ఇతర ప్రతినిధులతో కంపెనీ ప్రతినిధులు మాట్లాడారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు. కాగా, అంతకుముందు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో టెక్స్‌టైల్ పార్కుకు చేరుకున్న మంత్రి కేటీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి, యంగ్‌గోన్ కంపెనీ ప్రతినిధులు స్వాగతం పలికారు. టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్ కంపెనీకి టీఎస్‌ఐఐసీ ఇటీవల 298 ఎకరాలు కేటాయించింది.
Read also: Prabhas: పాన్ ఇండియా రూలర్!
Also Read
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
- Oil Palm Cultivation : తెలంగాణలో ఆయిల్‌పామ్ దూకుడు.. రైతులకు ‘మహా కారిడార్’ ప్లాన్
- Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్ కంపెనీ తన టెక్స్‌టైల్ పరిశ్రమల్లో 11,700 మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. పరోక్షంగా మరో 11,700 మందికి ఉపాధి లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టెక్స్‌టైల్ పార్కులో యంగ్‌గోన్ కంపెనీ రూ.840 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అనంతరం మంత్రి కేటీఆర్ ఖిలావరంగల్ వెళ్లనున్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అజంజాహీ మిల్స్ గ్రౌండ్‌లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ (ఐడీఓసీ) నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. దేశాయిపేటలో రూ.12.60 కోట్లతో ప్రభుత్వం నిర్మించిన 200 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను, వరంగల్‌లో రూ.135 కోట్లతో చేపట్టిన 16 స్మార్ట్ రోడ్లను కేటీఆర్ ప్రారంభించనున్నారు. రూ.75 కోట్లతో వరంగల్ మోడల్ బస్ స్టేషన్, రూ.313 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆజంజాహి మిల్స్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు.
PM Modi America Visit: అమెరికాలో ప్రధాని మోడీ పేరుతో కారు నంబర్ ప్లేట్
తాజావార్తలు
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్‌ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..