Kavitha: రౌస్ అవెన్యూ కోర్టుకు కవిత.. సీబీఐ కస్టడీపై తీర్పు రిజర్వ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం ఐదు రోజులు కస్టడీకి సీబీఐ కోరింది. మరోవైపు ఎటువంటి నోటీసులు లేకుండానే తనను అరెస్ట్ చేయడం అన్యాయమని కవిత పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత కీలక పాత్రధారి, సూత్రధారిగా సీబీఐ తెలిపింది. విజయ్ నాయర్, తదితరులతో కలిసి కవిత ప్లాన్ చేసినట్లుగా గుర్తించారు. ఢిల్లీ, హైదరాబాద్‌లో సమావేశాలు జరిగాయని, కవిత ఆడిటర్ బుచ్చిబాబు వాంగ్మూలం ప్రకారం కవిత పాత్ర స్పష్టమవుతుందని పేర్కొంది. ఇక ఆప్ నేతలకు సౌత్ గ్రూప్ ద్వారా రూ.100 ముడుపులు ఇచ్చినట్లుగా గుర్తించారు. కవిత సూచన మేరకు మాగుంట శ్రీనివాసులురెడ్డి రూ. 25 కోట్లు (రూ.15 కోట్లు ఒకసారి, రూ10 కోట్లు ఒకసారి) అందజేశారు. ఈ విషయాన్ని ఆయన తన వాంగ్మూలంలో వెల్లడించారు. వాట్సాప్ సంభాషణలు కూడా ఈ విషయాలను ధృవీకరిస్తున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సీబీఐ కోర్టుకు సమర్పించింది.
Also Read
- Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
- Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
- Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
- Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు

‘‘కవిత పీఏ అశోక్ కౌశిక్ వాంగ్మూలం ప్రకారం అభిషేక్ బోయినపల్లి సూచన మేరకు భారీ మొత్తంలో ఆప్ నేతలకు డబ్బు అందించినట్టు చెప్పాడు. ఆడిటర్ బుచ్చిబాబు స్టేట్‌మెంట్ ప్రకారం కవితకు ఇండో స్పిరిట్స్ సంస్థలో 33 శాతం వాటా ఉంది. ఇవన్నీ మేము ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లలో పొందుపరిచాం. శరత్ చంద్ర రెడ్డికి డిల్లీలో కేటాయించిన 5 జోన్లకు ప్రతిఫలంగా జోన్‌కి 5 కోట్లు చొప్పున మొత్తం 25 కోట్లు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. అందుకు శరత్ చంద్ర రెడ్డి ఒప్పుకోలేదు. దీంతో శరత్ చంద్ర రెడ్డిని కవిత బెదిరించారు. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపారాలకు ఇబ్బంది ఉంటుంది అని కవిత బెదిరించారు.’’ అని సీబీఐ తెలిపింది.
కోర్టులో కవిత తన వాదన వినిపించారు. తనను అరెస్ట్ చేస్తున్నారనే విషయం జైలు అధికారులు రాత్రి 10:30కి చెప్పారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో తనకు లీగల్ సలహా కావాలని తాను అడిగానని.. కానీ ఇంతలోనే తనను అరెస్ట్ చేశారని వాపోయారు. కవిత వాదనపై న్యాయస్థానం స్పందిస్తూ.. అరెస్ట్ అప్లికేషన్ ఫైల్‌ను సీబీఐ తమ ముందు పెట్టిందని.. వారికి తామే అనుమతి ఇచ్చినట్లు పేర్కొంది. ఇది కోర్టు పరిధిలోని అంశం అని జడ్జి వెల్లడించారు. కోర్టునే ప్రశ్నించొద్దని కవితకు సూచించారు. అలాగే కోర్టును ప్రశ్నించేలా కౌంటర్ వేయొద్దని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఈడీ అధికారులు హైదరాబాద్‌లో కవితను అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా రెండు సార్లు ఈడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. అనంతరం మళ్లీ కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. అనంతరం సీబీఐకి కూడా విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. తాజాగా సీబీఐ కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. సీబీఐ కూడా ఐదు రోజులు కస్టడీ కోరింది. కోర్టు ఏం చెబుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Free LPG Cylinders Scheme: గుడ్‌న్యూస్ చెప్పిన గోవా సీఎం.. 3 ఎల్పీజీ సిలిండర్లు ఫ్రీ.. కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్
-
Krishna River Management Board: తెలంగాణకు KRMB షాక్.. కీలక ఆదేశాలు జారీ..
-
Trump: రష్యా, ఉక్రెయిన్‌కు ట్రంప్ దూతలు.. యుద్ధానికి ముగించేందుకు శాంతి ప్రయత్నాలు
-
Kurnool High Court Bench: కర్నూలులో హైకోర్టు బెంచ్.. మంత్రి టీజీ భరత్ కీలక వ్యాఖ్యలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!