కేసీఆర్ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ప్రవలిక పరువు తీసేందుకు పోలీస్ ను వాడుకుంటున్నారని, ప్రజలు అమాయకులు కాదన్నారు లక్ష్మణ్. ఎన్నికలు అయినా కాకున్నా శాంతి భద్రతలు కాపాడేది రాష్ట్ర సర్కారు బాధ్యత ఎన్నికల సంఘంది కాదరన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది కేటీఆర్ వాదన అని, ఎన్నికల నిర్వహణ మాత్రమే ఎన్నికల సంఘం బాధ్యత అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆత్మహత్య కు వేరే కారణం ఉందంటే నిరుద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని, పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల నిర్వహణ, లీకేజీలతో 30 లక్షల మందిని మోసం చేశారన్నారు. ప్రవలిక గ్రూప్ 4 రాసి గ్రూప్ 1, 2 కోసం ప్రిపేర్ అవుతున్న విషయం కేటీఆర్ దాస్తే దాగేది కాదని, మీ చేతగాని తనం కోసం చనిపోయిన అమాయక అమ్మాయి మీద నెపం నెట్టడం మరింత దారుణమన్నారు.
Also Read : TCS: జాబ్ చేయలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఆ కంపెనీలో 40వేల మందికి ఫ్రెషర్లకు ఛాన్స్
అంతేకాకుండా.. ‘కర్కశంగా ఒక కుటుంబాన్ని అబాసు, అప్రతిష్ఠ పాలు చేయడం కరెక్టేనా? మానవత్వం ఉన్న ఎవరూ కేటీఆర్ లా వ్యవహరించరు, మాట్లాడరు. ఒక్క పోటీ పరీక్ష కూడా సక్రమంగా నిర్వహించని చరిత్ర మీది. 3016 నిరుద్యోగ భృతి ఇస్తా అని మోసం చేసింది మీరు. ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయి. పేదలు చదివే బడులు మూత పడుతున్నాయి. పిల్లల భవిష్యత్ పై తల్లితండ్రుల ఆందోళన బాగా పెరిగింది.
యువత తిరగపడుతున్నరు. ఆ కుటుంబం తో పాటు నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తారు. విచారణ కాకముందే, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే డీసీపీ ఎలా తీర్పు ఇస్తారు. చర్యలు తీసుకోవాల్సింది డీసీపీ మీద చర్య, సీఐ మీద కాదు. యువత రగిలిపోతున్నారు’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Also Read : Apple IPhone: బాక్స్ తెరవకుండానే ఐఫోన్లు అప్‌డేట్.. కొత్త ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసా?