బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే.. కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. మా పథకాలనే కాఫీ కొట్టారని కాంగ్రెస్ శ్రేణులు కేసీఆర్‌పై మండిపడుతుంటే.. అమలు చేయలేని హామీలు మేనిఫెస్టోల పెట్టారని బీజేపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు, రాజ్యసభ ఎంపీ డా. లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేయడానికి అమలుకు నోచుకోని హామీలని వ్యాఖ్యానించారు. నమ్మించండం వంచించడం కల్వకుంట్ల కుటుంబానికే చెందుతుందని, 2014, 2018 హామీలు ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read : Jana Reddy : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి రాగానే వెంటనే అమలు చేస్తాం..
అంతేకాకుండా.. ఆసరా ఏమైంది? 5 లక్షలు గృహలక్ష్మి ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. దివ్యాంగులకి ఏమి ఒరగబెట్టారని ఆయన మండిపడ్డారు. మోడీ పార్లమెంట్ లో చట్టం తెచ్చారు, యాసిడ్ దాడి బాధితుల ను కూడ చేర్చారని, దళిత బంధు చివరికి ఎంత మందికి ఇచ్చారని ఆయన అన్నారు. రైతు రుణమాఫీ లేక రైతులు ఇబ్బంది పడ్డారు, వడ్డీలు కట్టలేక చివరికి ఆత్మహత్య లు చేసుకున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. మహిళా సంఘాల డబ్బులు దోచుకున్న మీకు వాళ్ళ ఉసురు తాకుతుందని, మహిళలకు రిజర్వేషన్ ఇస్తే కవిత లిక్కర్ కేసు లో విచారణ కు వెళ్లారని ఆయన విమర్శలు గుప్పించారు. ఒక్క మహిళా ఓబీసీకి టికెట్ ఇవ్వలేదని, దళిత సీఎం, మూడెకరాల మొదలు వాళ్ళను మోసం చేసినవ్ అంటూ కేసీఆర్‌పై నిప్పలు చెరిగారు లక్ష్మణ్. బీసీ సబ్ ప్లాన్ చట్టం అని అన్నవ్ ఏమైందని, అది నోరా మోరా? అంటూ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్ పచ్చి బీసీ వ్యతిరేక పార్టీ అని, ఒక్క రేషన్ కార్డుకే దిక్కు లేదు.. దేశం రేషన్ కార్డు కూడా ఇవ్వలేని రాష్ట్రం ఇది అని ఆయన అన్నారు. ఎంబిసి కార్పొరేషన్ ఏమైంది? ఇంటికి ఒక ఉద్యోగం కాదు ఊరికొకటి అయినా ఇచ్చవా? అని ఆయన అన్నారు. యువత కాచుకుని కూర్చుంది మీ సర్కారును కూల్చడానికి అని, మీ రంగుల సినిమాలు చూసి ప్రజలు మోసపోరన్నారు.