ఎల్బీనగర్ కాషాయమయంగా మారింది. భారీ జన సంద్రంతో ఎల్బీనగర్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి నామినేషన్ వేశారు. నామినేషన్ కు ముందు హయత్ నగర్ లోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి.. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజాసింగ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. బీజేపీ శ్రేణులు, మిత్ర పక్షం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు.