ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీటితో పాటు పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, రక్షణ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరు నేతలు దృష్టి పెట్టారు. అంతేకాకుండా.. ఇండియా, సౌదీ అరేబియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ కౌన్సిల్ తొలి సమావేశం మినిట్స్‌పై ఇరువురు నేతలు సంతకాలు చేశారు.