Pushpa 2 The Rule Release Date: ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప2 టాప్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈసారి దానికి తోడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ అవార్డ్ అందుకున్న క్రమంలో పుష్ప 2 పై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే పుష్ప2ని నెక్స్ట్ లెవల్ అనేలా తెరకెక్కిస్తున్న సుకుమార్ నేషనల్ అవార్డ్ ఇచ్చిన బూస్టింగ్‌తో ఇంకెలా డిజైన్ చేస్తాడో ఊహించుకోవచ్చని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే ఏ విషయంలో కాంప్రమైజ్ అవకుండా పుష్ప2ని పుష్ప పార్ట్ వన్ లైఫ్ టైం కలెక్షన్ల కంటే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు.
Mark the Date ❤️🔥❤️🔥
15th AUG 2024 – #Pushpa2TheRule Grand Release Worldwide 🔥🔥
PUSHPA RAJ IS COMING BACK TO CONQUER THE BOX OFFICE 💥💥
Icon Star @alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @ThisIsDSP @SukumarWritings @TSeries pic.twitter.com/LWbMbk3K5c
— Mythri Movie Makers (@MythriOfficial) September 11, 2023
ఇప్పటికే సుకుమార్‌కు అన్ లిమిటేడ్ బడ్జెట్ తో సినిమా చేసుకోమని మైత్రీ మూవీ మేకర్స్ ఆఫర్ ఇచ్చినట్టు కూడా టాక్ ఉంది. అవుట్ పుట్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా సినిమాను జక్కన్నలాగా మారి చెక్కుతున్నాడు. ఈ సినిమా నుంచి గతంలో రిలీజ్ అయిన వేర్ ఈజ్ పుష్ప వీడియో, బన్నీ అమ్మవారి గెటప్ హైప్‌ను పీక్స్‌కు తీసుకెళ్లగా ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడొస్తుంది? అనే విషయంలో కొన్నాళ్ల నుంచి రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసింది. ఈ సినిమాను ఆగస్టు 15 2024న రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది.
అంటే ఒక రకంగా ఆ నెలలో లాంగ్ వీకెండ్ ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఆగస్టు 15 గురువారం నాడు రిలీజ్ చేస్తున్నారు, ఇక శుక్రవారం ఒక్కరోజు వర్కింగ్ ఉండే ఉంటుంది, ఆ తరువాత శని, ఆదివారాలు కూడా సినిమాకి కలిసి రానున్నాయి. పాన్ ఇండియా లెవల్లో సెలవు దొరికే రోజు కావడంతో పుష్ప యూనిట్ వ్యూహాత్మకంగా ఆరోజునే సినిమా రిలీజ్ చేస్తున్నట్టు చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆగస్టు 15-18 వరకు లాంగ్ వీకెండ్ ఉండగా, ఆ తరువాతి రోజు దేశవ్యాప్తంగా జరుపుకునే రాఖీ పండుగ వచ్చింది. ఇక ఆగస్టు 26న నార్త్ లో ఎక్కువ జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి జరగనుంది. ఇక మరో పదిరోజులకు వినాయక చవితి కూడా ఉంది.
Sameera Sherief: రక్తమోడే ఫోటో షేర్ చేసిన నటి.. అసలు ఏమైంది?