బిగ్‌బాస్ సీజన్ 9 క్లైమాక్స్‌కి వచ్చేసింది. సెప్టెంబర్ 7న మొదలైన ఈ రచ్చ ఇప్పుడు గ్రాండ్ ఫినాలే కి రెడీ అయిపోయింది. ప్రస్తుతం హౌస్‌లో ఏడుగురు సభ్యులు (తనూజ, కల్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజనా, పవన్, సుమన్ శెట్టి, భరణి) టైటిల్ కోసం చెమటోడ్చుతున్నారు. అయితే ఫినాలేకి కేవలం టాప్-5ని మాత్రమే మిగులుతారని మనకు తెలిసిందే. అంటే ఈ వారం ఇద్దరు ఇంటి దారి పట్టాల్సిందే. అందుకే ఆడియన్స్‌కి షాకిస్తూ ఈ గురువారమే ‘మిడ్ వీక్ ఎలిమినేషన్’ ప్లాన్ చేశారట. పడాల కల్యాణ్ సేఫ్ జోన్‌లో ఉండగా.. మిగతా ఆరుగురు నామినేషన్స్‌లో ఉండటంతో హౌస్‌లో టెన్షన్ మామూలుగా లేదు.
Also Read : Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్’ రిలీజ్‌పై భారీ ట్విస్ట్!
ఇక ఓటింగ్ లెక్కల విషయానికి వస్తే.. తనూజ ఎప్పటిలాగే టాప్‌లో దూసుకెళ్తుంటే, భరణి, పవన్ ఆ తర్వాతి స్థానాల్లో సేఫ్‌గానే ఉన్నారు. కానీ అసలు ముప్పు సంజన, సుమన్ శెట్టి కే పొంచి ఉంది. ఓటింగ్ పరంగా సుమన్ శెట్టి లీస్ట్‌లో ఉండగా, సంజన టాస్కుల్లో వీక్ అయ్యిందనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం అందుతున్న లీకుల ప్రకారం ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా మరికొన్ని గంటల్లో ఈ హైడ్రామాకి తెరపడనుంది, ఫైనల్ టాప్-5 ఎవరో తేలిపోనుంది.