తెలుగులో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ ప్రస్తుతం 7 వ సీజన్ ను జరుపుకుంటుంది.. ఈ సీజన్ లో గ్లామర్ తో ఆకట్టుకుంటున్న బ్యూటీలలో రతికా రోజ్ ఒకటి.. బిగ్ బాస్ స్టేజ్ పై తన అందం తో కవ్వించిన ఈ భామ ఎవరు అంటూ గూగుల్ ను గాలిస్తున్నారు ప్రేక్షకులు.. ఈమె ఎక్కడైనా సినిమాల్లో నటించిందా అంటూ ఒక్కటే వెతికేస్తున్నారు.. ఈ అమ్మడు హౌస్ లో యాక్టివ్ గా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక రతిక బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన రతిక తన బ్రేకప్ స్టోరీ గురించి చెప్పింది. అయితే ఆమె లవర్ ఎవరు.. అని అందరు ఆరా తీసుతున్నారు.
అయితే రతిక లవర్స్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అని తెలుస్తోంది. బిగ్ బాస్ స్టేజ్ పై నాగార్జున నీ లవర్ గురించి చెప్పు అని అడగ్గా ఇప్పుడు పాట పాడాలా అంటూ షాక్ ఇచ్చింది. అంటే తన లవర్ ఓ సింగర్ అని హింట్ ఇచ్చింది.. ఓ సందర్భంలో అతనికోసం బాగా మిస్ అవుతున్నా అని కన్నీళ్లు పెట్టుకుంది..ఇక బిగ్ బాస్ మీరు చాల పాటలు వినిపించారు మీకోసం ఓ పాటను నేను వినిపిస్తాను అని అన్నరు. దాంతో నా కోసం ఏమైనా పాట పాడిండా ..? అని అడిగింది. ఇంతలో ప్రియురాలు పిలిచింది నుంచి’ పిల్లా.. పిల్లా భూలోకం దాదాపు కన్ను మూయు వేళా అనే సాంగ్ ను ప్లే చేశారు..
ఆ పాటను గతంలో బిగ్ బాస్ హౌస్ లో రాహుల్ సిప్లిగంజ్ పాడారు.. దాంతో అందరు అతనే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమో అని కన్ఫర్మ్ చేసుకున్నారు..సాంగ్స్ పాడక ముందు రాహుల్ ప్రయివేట్ ఆల్బమ్స్ చేశారు. ఆ సమయంలో రతికతో పరిచయం ఏర్పడిందని..ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత పునర్నవితో రాహుల్ లవ్ ట్రాక్ నడిపాడు. దాంతో రతిక రాహుల్ మధ్య గ్యాప్ వచ్చిందని తెలుస్తోంది.. వారిద్దరూ కలిసి దిగిన ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..