MP Komati Reddy: అక్కడి వరకు మెట్రోను పొడిగించండి.. కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖ రాశారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మెట్రో పొడిగించాలని ఆయన కోరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖలో పేర్కొన్న విషయాలు: ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్(అబ్దుల్లాపూర్‌మెట్) వరకు మెట్రో లైన్ పొడిగింపు అవసరం ఉంది.. అలాలగే హైదరాబాద్ నగరం అటు వైపు వేగంగా విస్తరిస్తోంది.. ఎంతోమంది ప్రజలు హయత్ నగర్ నుంచి ఎల్బీనగర్ వరకు వెళ్లి.. అక్కడి నుంచి మెట్రోకు వెళ్తున్నారు. ప్రయాణికులకు చాలా కష్టంగా ఉంటోంది.. సాధారణ ప్రజలకు ముఖ్యంగా ఆఫీస్ లకు వెళ్లేవారికి చాలా అసౌకర్యం కలుగుతోంది అని అన్నారు. ఈ లైన్ ను పొడిగించే యోచన ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపడానికి ముందుకు రావడం లేదు అని వెంకట్ రెడ్డి అన్నారు.
Read Also: Unstoppable in OTT : ఓటీటీలోకి వచ్చేసిన ‘’వీజే సన్నీ’’ అన్ స్టాపబుల్
Also Read
- రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
- 20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
- Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
నగరంలో రోజురోజుకీ వాహనాల రద్దీ పెరుగుతోంది. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఎంపీ వెంకట్ రెడ్డి అన్నారు. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.. పైగా, రోడ్ల నిర్వహణ సరిగ్గా ఉండడం లేదు.. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఈ మార్గంలోని జాతీయ రహదారి 65ను 6 లేన్లుగా కేంద్రం మారుస్తోంది.. రానున్న రోజుల్లో వాహనాల రద్దీ మరింత పెరుగుతుంది.. అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్.. ఆ చుట్టుపక్కల ప్రజల ప్రయాణం మరింత దుర్భరంగా మారే ఛాన్స్ ఉంటుంది.. కాబట్టి మెట్రో విస్తరణ జరిగితే ప్రయాణికులు సొంత వాహనాల వాడకం తగ్గించే ఛాన్స్ ఉంది అని భువనగిరి ఎంపీ పేర్కొన్నారు.
Read Also: Cocaine: రికార్డు స్థాయిలో 5.3 టన్నుల కొకైన్ పట్టివేత.. విలువెంతో తెలిస్తే షాకవుతారు!
ఎల్బీనగర్-హయత్ నగర్ మార్గంలో మెట్రో విస్తరణపై కేంద్రం సానుకూలంగానే ఉందని ఎంపీ వెంకట్ రెడ్డి అన్నారు. కేంద్ర గృహనిర్మాణ- పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి హర్దీప్ పురికి గతంలో లేఖ రాశాను.. దీనిపై ఆయన స్పందించి రాష్ట్ర మున్సిపల్ శాఖకు ఫార్వార్డ్ చేశారు అని తెలిపారు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలి.. కేంద్రానికి నేను రాసిన లేఖను, రాష్ట్రప్రభుత్వానికి ఢిల్లీ నుంచి వచ్చిన లేఖను కూడా మీకు పంపుతున్నా.. ఈ విషయాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని కోరుతున్నాను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ టీజర్ రిలీజ్… గూస్బంప్స్ గ్యారెంటీ!
-
LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
Hitech City Traffic : గంట వర్షం.. 3 గంటల నరకం..! హైదరాబాద్ ఐటీ హబ్‌ను ముంచేసిన భారీ వర్షం
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
ట్రెండింగ్
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!