Unstoppable OTT Release: పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా గుర్తింపు తెచ్చుకున్న డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో కామెడీ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్ ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటించిన ఈ సినిమాలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లుగా నటించారు. జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన తెచ్చుకోగా IMDB లో 7.8 రేటింగ్ , బుక్ మై షో లో 8.2 రేటింగ్ రాబట్టుకుంది.
Vishwak Sen vs Sai Rajesh:నో అంటే నో..అది మగాళ్ళకి కూడా.. బేబీ డైరెక్టర్ కి విశ్వక్ కౌంటర్లు?
ఇక తాజాగా ఈ ‘అన్ స్టాపబుల్’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీం అవుతోంది. సో ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటిటిలో చూసి ఎంజాయ్ చేయవచ్చన్న మాట. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు నిర్మించిన మొదటి సినిమా అన్ స్టాపబుల్ కాగా త్వరలో మరిన్ని మంచి సినిమాలతో నిర్మాత రంజిత్ రావ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘ధమాకా’ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందచగా డీవోపీ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా ఉద్ధవ్ పని చేశారు.