Bhumana Karunakar Reddy: చంద్రబాబు మాటలపై పవన్ సమాధానం చెప్పాలి.. ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..?
- సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత భూమన ఫైర్..
- బాబు అబద్దాల మాటలపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి..
- అబద్దాలు చెప్పినందున ఇప్పుడు ఏ గుడిమెట్లు కడుగుతారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar Reddy: సంక్షేమ పథకాలపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మండిపడుతోంది.. అమరావతి, పోలవరం, స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమన్న సీఎం.. మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నానని, ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. అయితే, చంద్రబాబు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి.. చంద్రబాబు అబద్దాల మాటలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు.. అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కల్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు..? అని ఎద్దేవా చేశారు..
Read Also: Union Budget 2025: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. వీటిపై గంపెడు ఆశలు పెట్టుకున్న ప్రజలు..!
Also Read
చంద్రబాబు మరోసారి వెన్నుపోటు పొడిచారు.. నీతిఅయోగ్ పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలేనని మోసం చేశారు అని మండిపడ్డారు భూమన.. అధికారంలోకి వస్తే 15 వేలు పిల్లలకు, రైతు భరోసా, నిరుద్యోగ భృతి అంటూ హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదని అబద్దాలు చేబుతున్నారు అని దుయ్యబట్టారు.. ఎన్నికలలో ప్రచార సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంటో చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు తెలియదా? అని నిలదీశారు.. ఎన్నికల సమయంలో ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా.. వైఎస్ జగన్ కంటే ఎక్కవగా ఇస్తామని హామీ ఇచ్చారు… ఇప్పుడేమో చేతులేత్తేశారని విమర్శలు గుప్పించారు.. ఘోరమైన పాలన చంద్రబాబు చేస్తున్నాడు.. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇస్తామని.. మళ్లీ అబద్దాలు చేబుతున్నాడు.. అబద్దాలు బుద్దుడు ఈ చంద్రబాబు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు..
Read Also: Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో సంచనల విషయాలు వెల్లడి
ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు భూమన.. రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నాడు.. కూటమి ప్రభుత్వంపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు.. తల్లికి వందనం కాస్తా తల్లికి తద్దినంగా చేశాడు.. అన్నదాత సుఖీభవ కాస్తా అన్నదాత అప్పుభవా అయ్యింది. చంద్రబాబు అబద్దాల మాటలపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. జగన్ సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి పరిపాలన చేశాడు.. కానీ, రాష్టాన్ని ఇప్పుడు మద్యాంధ్రప్రదేశ్ గా మార్చారు అని ఆరోపించారు.. ఇచ్చిన హామీలు 98 శాతం జగన్ అమలు చేశారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..