సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సూర్యాపేట జిల్లాలో కొనసాగుతోంది. అయితే.. ఈ రోజు చివ్వేoల మండలం చందుపట్ల (బీ) లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన వ్యక్తి గద్దర్ అన్న అని కొనియాడారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని ఆయన మండిపడ్డారు. నియామకాలు లేకపోవడంతో యూనివర్సిటీలు నిరుద్యోగులకు కేంద్రాలుగా మారాయని, భారత్ జూడో యాత్రకు భయపడి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించారన్నారు. దురుద్దేశంతోనే రాహుల్ గాంధీ క్వార్టర్స్ ఖాళీ చేయించారన్నారు. కేంద్రం ఎలాంటి చట్టాలు తీసుకువచ్చినా… మద్దతు తెలుపుతూ బిజెపితో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుందన్నారు.
Also Read : Rocket Star Ship: రాకెట్ స్టార్‌షిప్ ప్రయోగంలో మరో కీలక అప్ డేట్ ఇచ్చిన ఎలాన్ మస్క్
అంతేకాకుండా.. ‘రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి.. రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు జరుగుతున్నాయి… బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లే.. ఈ విషయాన్ని మైనారిటీ లో మదిలో పెట్టుకోవాలి. రైతులు, నిరుద్యోగులు, చేతివృత్తులు, కుల వృత్తుల వాళ్లు అందరూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తాం.. బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం.. రైతుబంధు మాత్రమే ఇచ్చి…. రైతుకు మిగిలిన అన్ని రకాల సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.. కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుంది. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది.. సూర్యాపేట ప్రజల స్పందన చూస్తుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అనిపిస్తుంది.. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ. నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్.. రాజు ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షలకు పెంపు.. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం ఐదు లక్షల రూపాయల మంజూరు.. భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12,500 రూపాయల పెన్షన్.. ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం చెల్లించే విధంగా నిర్ణయం.. ప్రజల సంపద ప్రజలకే చెందేలా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం..’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
Also Read : Pune: ప్రపోజల్‌ని తిరస్కరించిందని గర్ల్‌ఫ్రెండ్‌పై కొడవలితో దాడి..