బీఅర్ఎస్‌లో నిర్ణయాలు ప్రగతి భవన్ లో జరుగడం లేదా… మాది జాతీయ పార్టీ.. మా నిర్ణయాలు సమిష్టి గా వుంటాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ.. డబ్బులు అన్ని రాష్ట్రాలకు పంపించిన చరిత్ర బీ అర్ ఎస్ ది కాదా… మీలాగే అన్ని పార్టీ లు వుంటాయని అనుకోవడం పొరపాటన్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తుల చుట్టూ తిరగదు… కాంగ్రెస్ లో సమిష్టి నిర్ణయాలు వుంటాయని ఆయన వెల్లడించారు. గ్యారెంటీ వారంటీ వుంది కాబట్టే 150 ఏళ్ల నుంచి మనుగడ వున్న పార్టీ.. కాంగ్రెస్ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. త్వరలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన వుంటుంది… స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని ఆయన వెల్లడించారు.
Also Read : Nikhat Zareen: సెమీ ఫైనల్‌లో ఓటమి.. కాంస్యంతో సరిపెట్టుకున్న నిఖత్ జరీన్
పార్టీ ఎవ్వరినీ వదలుకోదని, కొత్త పాత వారిని కలుపుకుని సమన్యాయం చేస్తుందని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే లు బయటకు వెళ్తరన్న భయంతో బీఅర్ఎస్ ముందే సీట్లను ప్రకటించిందని ఆయన అన్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచినొక్కరు బయటకు వచ్చారు… ఇంకా ఎంత మంది బయటకు వస్తారో చూద్దామని ఆయన అన్నారు. మాకు అటువంటి భయం లేదు.. మాది జాతీయ పార్టీ.. మత తత్వానికి వ్యతిరేకంగా వుండే పార్టీల తో కలసి పని చేస్తామన్నారు. కాంగ్రెస్ కు ఎటువంటి డోకా లేదని, కాంగ్రెస్ లోకి వరదలా పార్టీలోకి వచ్చారు … వస్తున్నారని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యం వున్న పార్టీ మాది.. కాంగ్రెస్ లో టీమ్ వర్క్ వుంటుందని ఆయన అన్నారు. మంచి నిర్ణయాలు వుంటాయన్నారు భట్టి విక్రమార్క.
Also Read : IndiGo Plane Incident: గాలిలో విమానం.. చావుబతుకుల మధ్య పసికందు.. ఏం జరిగిందంటే..