Bhatti Vikramarka : తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం పీక్కు తింటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్ర షాద్ నగర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉద్యోగం చేతకాదని, ఆరోగ్యం సహకరిస్త లేదని వీఆర్ఎస్ తీసుకున్న మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కు తెలంగాణ చీఫ్ అడ్వైజర్ పదవిని ఎలా నిర్వహిస్తారు? అని ఆయన ప్రశ్నించారు. సోమేశ్ కుమార్ కు ఆంధ్రాలో ఉద్యోగం చేయడానికి లేని ఆనందం తెలంగాణలో ఏమున్నది? తెలంగాణలోని భూములను స్వాహా చేయడంలోనే ఆనందం ఉన్నదా సోమేశ్ కుమార్ ? అని భట్టి అన్నారు. అంతేకాకుండా.. ‘ మాజీ చీఫ్ సెక్రటరీగా, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా, సిసిఎల్ఏ కమీషనర్ గా పనిచేసిన సోమేశ్ కుమార్ కోర్టు కేసుల్లో ఉన్న భూములను సైతం రాజీ చేయించి ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసిన చరిత్ర ఉన్నది. వందల సంవత్సరాల నుంచి పేదలు కాపాడుకుంటూ వచ్చిన తెలంగాణలోని భూములను సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం వాటిని మాయం చేశారు. ధరణి తీసుకొచ్చి జాగిర్దారు, అన్క్లైన్డు, అవే క్యూ లో ఉన్న భూముల సమాచారం తీసుకొని ఆ భూములను పార్ట్- బి లో పేర్కొని ప్రభుత్వ పెద్దలు హాంఫర్ట్ చేసే విధంగా సహకరించిన గొప్ప మేధావి సోమేశ్ కుమార్.
Also Read : Dulquer: మలయాళ సూపర్ స్టార్ మరో తెలుగు సినిమా…
Also Read
సబ్బండ వర్గాలు కొట్లాడి కోరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది పేదల భూములు గుంజుకోవడానికేనా? కొలువుల కోసం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులు గబ్బిలం లాగా పదవులను పట్టుకొని వేలాడటం దేనికి? తెలంగాణ ప్రజలను ఇంకెంతకాలం పీక్కు తింటారు. కొత్త వారికి ఉన్నత పదవులు అవకాశం కల్పించడానికి రిటైర్డ్ అయిన ఉద్యోగులు గౌరవంగా తప్పుకోవాలి. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ను బొంబాయికి చెందిన ప్రైవేట్ ఏజెన్సీ కంపెనీకి 30 సంవత్సరాలు లీజు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దలకు పెసలుబాటు కల్పించింది మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమారులే. హైదరాబాద్ చుట్టు మిగులు ఉన్న భూములను చీఫ్ సెక్రటరీగా సోమేశ్ కుమార్ వచ్చిన తర్వాత ధరణి తీసుకురావడం భూములను గుంజుకోవడం మంత్రి కేటీఆర్ వాటిని బహుళ జాతి కంపెనీలకు దారా దత్తం చేయడం జరుగుతున్నది. విదేశీ పెట్టుబడులు తీసుకొస్తామని అమెరికా, దుబాయ్ వెళ్లిన కేటీఆర్ అక్కడ బహుళ జాతి కంపెనీలతో వాటాలు మాట్లాడుకుని తెలంగాణకు వచ్చి చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్లతో సమావేశమై మిగులు భూములు, గత ప్రభుత్వాలు పేదలకు పంచిన భూముల జాబితా సేకరించి వాటిని బలవంతంగా గుంజుకొని బహుళ జాతి కంపెనీలకు కట్టబెడుతున్న కెటిఆర్ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటివరకు గత ప్రభుత్వాలు పంపిణీ చేసిన పేదల భూములను ఎన్ని వేల ఎకరాలు గుంజుకున్నది, వాటిని ఎవరెవరికి దారా దత్తం చేసిన వివరాలను శ్వేత పత్రం ద్వారా విడుదల చేయాలి. తెలంగాణ ఏర్పడి 10 ఏండ్లు కావస్తున్న కృష్ణానదిలో నీటి వాటా తేల్చకుండా దద్దమ్మల నిద్రపోతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం.
Also Read : Leopard Attack: రెండేళ్ల చిన్నారిని చంపిన చిరుత.. వారంతో వ్యవధిలో మూడో ఘటన
కృష్ణా నదిలో తెలంగాణ వాటా ఎంత? ఇప్పటివరకు వాడుకున్నది ఎంత? ఇంకా వాడుకోవాల్సింది ఎంత? తేల్చకపోవడం దుర్మార్గం. గత ప్రభుత్వాలు డిజైన్ చేసిన ప్రాజెక్టులకు రీ డిజైన్ చేయడం, ఎస్టిమేషన్ పెంచడం ,ఆ పనులు కాంట్రాక్టర్ల కప్పగించడం, బిల్లులు డ్రా చేయడం, అందులో కమిషన్లు పొందే మమకారం నీళ్లు ఇచ్చేదానిపై ఈ పాలకులకు లేకపోవడం శోచనీయం. కృష్ణానది నీటి వాట తేల్చకపోవడంపై సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. కృష్ణా నదిపై సంగమేశ్వర్ వద్ద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఉమ్మడి మహబూబ్నగర్, నల్లగొండ, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు నీటి ఎద్దడి పొంచి ఉన్నది. రోజుకు 03 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువెళ్తే తెలంగాణ కృష్ణ తీర ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉన్నది. మన నీళ్లు మన భూములు కాపాడుకోవడం కోసం మరో పోరాటానికి సిద్ధం కావలసిన సమయం ఆసన్నమైంది’ అని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..