VRO Rekha Cheated Unemployed People In Vijayawada: అసలే ఉద్యోగం లేక దుర్భర పరిస్థితుల్లో ఉన్న నిరుద్యోగులను.. కొందరు దుండగులు మరింతగా దోచేసుకుంటున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని ఆశచూపి.. లక్షల్లో దండుకుంటున్నారు. ఇప్పుడు ఓ వీఆర్వో కూడా అలాంటి మోసానికే పాల్పడింది. తాను అడిగినంత డబ్బులు ఇస్తే.. మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పింది. నిరుద్యోగుల నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసింది. ఇదిగో, అదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చింది. చివరికి తాము ఆ వీఆర్వో చేతిలో మోసపోయామని గ్రహించిన నిరుద్యోగులు పోలీసుల్ని ఆశ్రయించగా.. వాళ్లు రంగంలోకి దిగి ఆమె భరతం పట్టారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Pawan Kalyan: తెలుగువారి ఆత్మగౌరవానికి ఎన్టీఆర్ ప్రతీక.. ఢిల్లీ దాకా సత్తా చాటారు
విజయవాడలో రేఖ అనే మహిళ వీఆర్వోగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఈజీ మనీకి అలవాటుపడ్డ రేఖ.. నిరుద్యోగుల్ని టార్గెట్ చేసింది. ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడటం మొదలుపెట్టింది. ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నామంటూ కొందరు తన వద్దకు వచ్చి గోడు వెళ్లబోసుకోగా.. వారిని ఉద్యోగాల పేరుతో ఎర వేయడం ప్రారంభించింది. తాను వీఆర్వోని కాబట్టి, తనకు పైఅధికారుల దాకా పరిచయాలు ఉన్నాయని.. తాను అడిగినంత డబ్బులిస్తే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికింది. ఎంతైనా వీఆర్వో కదా.. నిరుద్యోగులు ఆమె చెప్పిన మాటలు నమ్మి డబ్బులిచ్చారు. ఇలా ఒక్కో నిరుద్యోగి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా ఆ వీఆర్వో డబ్బులు వసూలు చేసింది.
Perni Nani: హత్య చేసిన చేతులతో.. దండం పెట్టే వ్యక్తి చంద్రబాబు
ఇలా డబ్బులు వసూలు చేసిన వీఆర్వో రేఖ.. ఇదిగో, అదిగో అంటూ మాట దాటవేస్తూ వచ్చింది. కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉందని, ఉద్యోగాలు రావడానికి సమయం పడుతుందని చెప్తూ వచ్చింది. కానీ.. రోజులు గడుస్తున్నా, ఉద్యోగాలు రాకపోయేసరికి.. డబ్బులిచ్చిన వాళ్లందరూ రేఖను నిలదీశారు. దీంతో ఆమె ముఖం చాటేసింది. ఈ నేపథ్యంలో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వీఆర్వోను అరెస్ట్ చేశారు.