దేశంలో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అక్రమ కేసు పెట్టి సూరత్ కోర్టులో జైలు శిక్ష పడేలా చేసి, కోర్టు శిక్ష వేసిందన్న సాకుతో 2 సంవత్సరాల పాటు పార్లమెంటు నుంచి బహిష్కరణ చేయడం మోడీ అమిత్ షా బీజేపీ నాయకత్వంలో జరిగిన కక్ష సాధింపు చర్య అని ఆయన మండిపడ్డారు. తొమ్మిది సంవత్సరాల బిజేపి పరిపాలనలో దేశ సంపదను ప్రధాని మోడీ క్రోనీ క్యాపిటలిస్ట్ లకు దోచిపెడుతున్నారని, ప్రజల సంపద ప్రజలకే చెందాల్సిన ఈ దేశంలో ప్రధాని మోడీ ఆదానికి దోచిపెడుతుంటే గొంతెత్తి ప్రశ్నించిన రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడానికే బిజెపి ప్రభుత్వం బహిష్కరణ కుట్రకు పాల్పడిందన్నారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశ సంపద దోపిడీకి గురవుతుందని పార్లమెంటు లోపల, బయట రాహుల్ గాంధీ గత తొమ్మిది సంవత్సరాలుగా ప్రశ్నిస్తుంటే కాంగ్రెస్ రాజకీయం చేస్తున్నదని బీజేపీ తప్పుడు విమర్శలు చేసిందన్నారు.
Also Read : Earth Hour: రాత్రి 8.30 గంటలకు ‘ఎర్త్ అవర్’.. అంటే ఏంటీ?
రాహుల్ గాంధీ చెబుతున్నది నిజమేనని అమెరికాకు చెందిన హిండేన్ బర్గ్ సంస్థ ఆదాని దోపిడీ చేసిన ఆర్థిక నేరం గుట్టును రట్టు చేసి ఆదానీ ఈదేశాన్ని కాదు, ప్రపంచాన్ని సైతం మోసం చేశాడని బయటపెట్టిందని, దేశాన్ని దోపిడీ చేస్తున్న బిజెపి ప్రజా వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు దేశంలో హిందూ, ముస్లిం విభజన పేరిట ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తుంటే కాంగ్రెస్ కలలు కన్న దేశం ఇది కాదంటూ రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి భారత్ జోడో చేశారన్నారు. భారత్ జోడో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీకి దేశంలో అన్ని వర్గాల ప్రజల నుంచి పెరిగిన ఆదరణతో రానున్న ఎన్నికల్లో ప్రధాని అవుతాడన్న భయంతోనే మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు రాకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటున్నదని ఆయన అన్నారు.
Also Read : Buffalo Seized: ఇదేందయ్యో.. నీటి పన్ను బకాయి ఉందని గేదెను తీసుకెళ్లారు..
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ బహిష్కరిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన దేశభక్తులమైన కాంగ్రెస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు నినదించి కదం తొక్కుతారని ఆయన మండిపడ్డారు. మతం పేరిట దేశాన్ని విభజించి రక్తపాతం సృష్టించాలని చూస్తున్న బీజేపీ, రాహుల్ గాంధీ పోరాటం మనందరిది. అరచేతిలో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉందన్నారు. దేశ సమైక్యత , సమగ్రత, ఔలత్యం కోసం ప్రాణాలు అర్పించిన ఇందిరా, రాజీవ్ గాంధీ లా వారసుడు ఉడత ఊపులకు, తాటాకు చప్పులకు భయపడడని మోడీ గ్రహించాలని, రాహుల్ గాంధీ కాపాడుకోవడమే ఈ దేశాన్ని కాపాడుకోవడం, కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన ద్రోహి ఎమ్మెల్యే సక్కుకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.