Bharta Mahashayulaku Vignapti Trailer Launch: మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న “భర్త మహాశయులకు విజ్ఞప్తి” సినిమా ట్రైలర్ లాంచ్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో, SLV సినిమాస్ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామాతో నిండిన ఒక కంప్లీట్ ప్యాకేజీలా కనిపిస్తోంది. ఇక తాజాగా లాంచ్ అయినా ట్రైలర్ ప్రారంభంలోనే రవితేజ తనదైన శైలిలో ఫన్నీ డైలాగ్స్ తో ఆకట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా కత్తులు, ఫైట్లతో కూడిన యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేశానని, అందుకే తన “ఫ్యామిలీ డాక్టర్” సలహా మేరకు చిన్న గ్యాప్ ఇచ్చి ఈ తరహా సినిమా చేస్తున్నానని చెబుతూ కథలోకి తీసుకెళ్తారు.
‘Mana Shankara Vara Prasad Garu’: డాన్స్ ఫ్లోర్ షేక్ చేయబోతున్న మన శంకర వర ప్రసాద్ హుక్ స్టెప్..!
ఈ చిత్రంలో రవితేజ సరసన ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. కిషోర్ తిరుమల మార్కు కామెడీ ట్రెయిలర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇకపోతే గత కొన్నేళ్లుగా రవితేజ కెరీర్ చూసుకుంటే సరైన హిట్ అందుకోలేకపోయారు. మరి ఈసారైనా రవితేజ ఎలాంటి ఫలితం అందుకుంటాడో చూడాలి..? మొత్తంగా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” రవితేజ మార్కు ఎనర్జీతో పాటు, కుటుంబ ప్రేక్షకులు ఆకట్టుకునే అంశాలతో నిడినట్లుగా ట్రైలర్ కనిపిస్తోంది. ట్రెయిలర్‌లో చెప్పినట్లుగా.. “ముందు ఎంటర్టైన్మెంట్, తర్వాత అనౌన్స్మెంట్” అన్నటుగా ఇప్పటికే టీజర్లు అలరించాయి. సినిమా జనవరి 13న అంటే వచ్చే మంగళవారం థియేటర్లలో ప్రేక్షకుల ముందరికి రానుంది.
Pawan Kalyan: పెద్ద ప్లానింగే.. పవన్ కళ్యాణ్ ను అలా చూసేందుకు సిద్ధంగా ఉండండి..!