ACB: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదుతో దూసుకెళ్తుంది. కేవలం 2025 ఏప్రిల్ నెలలో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి.
ఏటీఎం ప్రారంభానికి ఎవరు వస్తారు? ఆ ఏటీఎంకి సంబంధించిన బ్యాంకు మేనేజర్, లేదా ఇతర కింది స్థాయి అధికారులు హాజరవుతారు. కానీ.. ఏటీఎం ప్రారంభానికి ఏకంగా ప్రధాని హాజరు కావడం ఎప్పుడైనా చూశారా? లేదా విన్నారా? కానీ.. ఇక్కడి అది జరిగింది. అవునండి.. నిజంగానే ఏటీఎం ప్రారంభానికి ప్రధాని హాజరయ్యారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ.. ఏం చేస్తాం ఆ దేశంలో ఇదే తొలి ఏటీఎం మరి.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్ వచ్చే వారం భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అమెరికా ఉపాధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. సమాచారం ప్రకారం.. జేడీ వాన్స్ ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 24 వరకు ఇటలీతో పాటు భారతదేశాన్ని సందర్శిస్తారు. అమెరికా ఉపాధ్యక్షుడు రెండు దేశాల నాయకులతో ఉమ్మడి ఆర్థిక, భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతలను చర్చిస్తారని ఉపాధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
Bhadradri : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన రాముల వారి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో భద్రాచలం పట్టణం వాహనాలతో కిక్కిరిసిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, మూడు గంటలకుపైగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభిజిత్ లగ్నం సమయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. దీన్ని వీక్షించేందుకు టెంపోలుగా, బస్సులుగా, కార్లుగా, ద్విచక్ర వాహనాలుగా భక్తులు సమీప ప్రాంతాల నుండి…
Bank Holidays: భారతదేశంలో బ్యాంకింగ్ రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతూ, సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటూ ముందుకు సాగుతోంది. ఒకప్పుడు బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించాలంటే బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండేది. అయితే ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి సదుపాయాలు అందుబాటులోకి రావడంతో బిల్లులు చెల్లించడం, డబ్బు బదిలీ చేయడం, ఖాతాల వివరాలను తనిఖీ చేయడం వంటి లావాదేవీలు చాలా సులభమయ్యాయి. అయితే బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం పొందడం, లాకర్ సదుపాయం ఉపయోగించడం, ఇలా కొన్ని…