Best Health Tips for warts in telugu
మిమ్మల్ని పులిపిర్లు విసిగిస్తున్నాయా.. ఊడి వాటంతట అవే పడిపోవడానికి కొన్ని చిట్కాలను చూద్దాం. పులిపిరి కాయలు చాలా సాధారణమైన సమస్య. జనాభా లో ప్రతి వందమందిలోనూ కనీసం పది నుండి పదిహేను మందికి చర్మం పైన పులిపిర్లు కనిపిస్తుంటాయి. ఈ పులిపిరి కాయలు, ఉలిపిరికాయలు అని, వాట్స్ అని సాధారణ పేరుతో పిలుస్తుంటారు. పులిపిర్లు అనేవి శరీరంలో జరిగే హార్మోన్ల మార్పు వల్ల దుమ్ము, చమట, ఒత్తిడి మొదలైన కారణాల వల్ల వస్తాయి. మెల్లగా మొదలై పక్కపక్కనే వ్యాపిస్తాయి. ఇవి ఎక్కువగా యుక్తవయస్సులో కనిపిస్తాయి. మగవారికంటే ఆడవాళ్ళ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ పులిపిర్లు చూడడానికి చర్మపు రంగులో కానీ, కాస్తంత ముదురు గోధుమ రంగులో కానీ బొడిపెల మాదిరిగా గరుకుగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నొప్పిని కలిగించవు. ఒకవేళ ఒత్తిడి పడే చోట వస్తే మాత్రం కొద్దిగా అసౌకర్యాన్ని, ఇబ్బందిని కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖం, పైన మెడపైన చేతులు, పాదాలు మొదలైన ప్రదేశాల్లోనూ వస్తుంటాయి. మరి వీటికి వైద్యం ఉందా అంటే ఆయుర్వేదంలో చిట్కా వైద్యం ఉంది. అవి ఏమిటో చూద్దాం. వెల్లుల్లి రేఖలను పులిపిరి ల పైన రుద్దాలి. వెల్లుల్లి లోని యాంటీ వైరల్ గుణం వల్ల పులిపిర్లు తగ్గుతాయి.
ఇలా కనీసం రెండు మూడు వారాల పాటు చేయాలి. ఉల్లిపాయలు సగానికి కోసి మధ్య భాగాన్ని చెంచాతో తొలగించి, సముద్రపు ఉప్పుతో నివ్వాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లి రసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి, జాగ్రత్త చేసుకొని ముప్పై రోజుల పాటు పులిపిర్లపైన ప్రయోగిస్తుంటే గుణం కనిపిస్తుంది. పులిపిర్లకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టిక్కింగ్ అతికించాలి. ఇలా రెండు పుటల మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కొత్త సున్నా ని పులిపిర్లపై పైన ప్రయోగిస్తే రాలిపడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి, కొత్త సున్నంలో ముంచి, పులిపిర్ల పైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుపక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి. బంగాళదుంపలు మధ్యకు కోసం ముక్కలతో రుద్దుతూ ఉండాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తుంటే పదిహేను రోజుల్లో పులి పేర్లు ఎండిపోయి రాలిపోతాయి. ఇక పులి పురులు మొండిగా తయారయ్యి ఇబ్బంది కలిగిస్తుంటే, వైద్య సలహా మేరకు కాశీ సాది తైలాన్ని పైపూత కు వాతారి గుగ్గులు అనే మందులను లోపలకు నిర్ణీత కాలంపాటు వాడాలి.
అలాగే అదే సమయంలో పులి పిల్ల తగ్గడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మం తేమగా ఉంటే, పులి పిల్లని కలిగించే వైరస్ లు పెరగడానికి, జీవించి ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చర్మాన్ని ముఖ్యంగా పాదాలను, చేతులను, మెడను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. చెమటతో తడిసిన సాక్స్‌లను, కర్చీఫ్ లను ప్రతిరోజు మారుస్తూ వాడాలి. వాడ, బోయేముందు వీటిని తడి ఆరిపోయేలా ఎండలో బాగా ఆరబెట్టాలి. పులిపిరి లను కలిగించే వైరస్ గాయమైన చర్మం నుంచి శరీరంలోకి తేలికగా ప్రవేశిస్తాయి. కనుక గాయాలు, దెబ్బలు కాకుండా చూసుకోవాలి. కరచాలనం అంటే అలవాటు మానుకోవాలి. పులిపిరి ఏర్పడిన చర్మాన్ని పదేపదే స్పర్శించి కూడదు.