TVS iQube ST Launch, Price and Range in India: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ‘ఓలా’ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఓలా తర్వాత అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ‘టీవీఎస్ ఐక్యూబ్’ నిలిచింది. జూన్ నెలలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్.. 7,791 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. రేంజ్ పరంగా టీవీఎస్ ఐక్యూబ్ బెస్ట్ అని చెప్పొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ధర మరియు ఫీచర్ల గురించి ఓసారి చూద్దాం.
టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ముందుగా ‘ఐక్యూబ్’ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. టీవీఎస్ ఐక్యూబ్ మూడు వెర్షన్లలో వస్తుంది. టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ మోడల్స్ ఉన్నాయి. మొదటి రెండు వేరియంట్‌ల ధర రూ. 1.31 లక్షల నుంచి రూ. 1.46 లక్షల వరకు ఉంటుంది. మూడో వేరియంట్ ధర ఇంకా వెల్లడికాలేదు. ఇందులో అత్యంత శక్తివంతమైనది ఐక్యూబ్ ఎస్‌టీనే. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్‌లో 145 కిలోమీటర్ల వరకు పరిధిని అందిస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ గరిష్ట వేగం గంటకు 82 కిలోమీటర్లు. ఈ స్కూటర్ బ్యాటరీ 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ కావడానికి సుమారు 4 గంటలు పడుతుంది. 0 నుంచి 40 కిమీ వేగాన్ని అందుకోవడానికి 4.2 సెకన్లు పడుతుంది. ఈ స్కూటర్ బరువు 128 కిలోలు. ఐక్యూబ్ యొక్క మొత్తం డిజైన్ సాంప్రదాయ స్కూటర్ మాదిరిగానే ఉంటుంది. హ్యాండిల్ బార్ కౌల్‌పై యూ-ఆకారపు హెడ్‌ల్యాంప్ మరియు టైలాంప్‌ను కలిగి ఉంటుంది. ఇది ఫుట్‌బోర్డ్ మరియు లగేజ్ హుక్‌తో వస్తుంది.
టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీలో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే ఉంది. దీని ద్వారా మీరు మ్యూజిక్ ఆన్ లేదా ఆఫ్ చేయవచ్చు. అలాగే సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు ఆపరేట్ చేయొచ్చు. అలెక్సా ఇంటిగ్రేషన్, రిమోట్ వెహికల్ ఇమ్మొబిలైజేషన్ మరియు రిమోట్ అన్‌లాకింగ్ ఇందులో ఉన్నాయి. ఈ స్కూటర్‌కు 32 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఇవ్వబడింది. ఇందులో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. అంతేకాదు రెండు హెల్మెట్లను సులభంగా పెట్టుకోవచ్చు.
Also Read: IND vs WI Dream11 Prediction: భారత్ vs వెస్టిండీస్ తొలి టెస్టు.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!