TVS Creon Electric Scooter Launch, Price and Range: భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం వినియోగదారులు పెట్రోల్ స్కూటర్‌ల కంటే ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్‌లనే కొనుగోలు చేస్తున్నారు. దాంతో అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్‌లను మార్కెట్లో లాంచ్ చేస్తున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి స్టార్టప్ వరకూ మార్కెట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వినియోగదారులు కూడా తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న స్కూటర్లనే కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టూ వీలర్ కంపెనీ ‘టీవీఎస్’ మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.
TVS Creon Electric Scooter Launch:
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ మొదటగా ఐక్యూబ్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెండో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను త్వరలోనే మార్కెట్‌లోకి తీసుకురానుంది. దాని పేరు ‘టీవీఎస్ క్రెయాన్’ ఎలక్ట్రిక్ స్కూటర్. 2023 ఆగస్టు 23న దీనిని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఈవెంట్ దుబాయ్‌లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఎలక్ట్రిక్ స్కూటర్లలో స్పోర్టీ లుక్‌లో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇది నిలిచిపోనుంది.
Also Read: IND vs WI Dream11 Prediction: భారత్ vs వెస్టిండీస్ తొలి టెస్టు.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!
TVS Creon Electric Scooter Range:
టీవీఎస్ క్రెయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 300 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇదే నిజమైతే ఎలక్ట్రిక్ ఆటో రంగంలో సరికొత్త రికార్డు అవ్వనుంది. ఎందుకంటే ఇప్పటివరకూ అంత రేంజ్ ఇచ్చే వాహనాలు లేవు. అందమైన ఇంటిగ్రేటెడ్ డిజైన్ ఎలిమెంట్స్ ఇందులో ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎల్‌ఈడీ లైట్లు ఉంటాయి. ఇక హ్యాండిల్ బార్‌పై డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది.
TVS Creon Electric Scooter Price:
టీవీఎస్ క్రెయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో పెరీమీటర్ ఫ్రేమ్ ఉంటుంది. ఇది బ్యాటరీ ప్యాక్ కోసం ఏర్పాటు చేశారు. ఇందులోని బ్యాటరీ ప్యాక్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ ఎలక్ట్రిక్ స్కూటర్ కన్నా అధిక సామర్థ్యంను కలిగి ఉంటుంది. ఐక్యూబ్ ఎస్టీ 5.1kwh సామర్థ్యంతో ఉంది. క్రెయాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ సామర్థ్యం ఏకంగా 10kwh ఉంటుందని అంచనా. అంతేకాక 10 నుంచి 12 కిలోవాట్ల సామర్థ్యంతో మోటార్ ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ 300 కిలోమీటర్లు. 150సీసీ సంప్రదాయ ఇంజిన్ వాహనాలకు దీటుగా ఈ స్కూటర్ పనితీరు ఉంటుందని సమాచారం. ఈ స్కూటర్ ధర 1.20 నుంచి ఆరంభం అవుతుందని తెలుస్తోంది.