IND vs WI Dream11 Prediction Today Match: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కొత్త సైకిల్‌లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్లు తలపడనున్నాయి. ఇరు జట్ల మధ్య జూలై 12 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుకు భారత్, వెస్టిండీస్ జట్లు సన్నదవుతున్నాయి. తొలి మ్యాచ్‌లో గెలిచి డబ్ల్యూటీసీ సైకిల్ 2023-25లో బోణీ కొట్టాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే వెస్టిండీస్ కన్నా.. భారత్ బలమైన జట్టు అనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి టెస్టులో గెలిచే అవకాశాలు రోహిత్ సేనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి టెస్టు డొమినికా వేదికగా జులై 12-16 మధ్య జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ మ్యాచ్ ఆరంభానికి అరగంట ముందు పడుతుంది. ఈ మ్యాచ్, స్టార్ స్పోర్ట్స్, డీడీ స్పోర్ట్స్ ఛానల్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. అలానే జియో సినిమా, ఫ్యాన్‌కోడ్ యాప్‌లలో కూడా చూడొచ్చు.
తొలి టెస్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. చేతేశ్వర్ పుజారా స్థానంలో యశస్వి జైస్వాల్ ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నాలుగో స్థానంలో విరాట్ కోహ్లీ, ఐదవ స్థానంలో అజింక్య రహానే ఆడతారు. ఆరో స్థానంలో శ్రీకర్ భరత్, ఏడవ స్థానంలో రవీంద్ర జడేజా, 8వ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ ఆడనున్నారు. మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్/శార్దూల్ ఠాకూర్, ముఖేశ్ కుమార్ బౌలింగ్ కోటాలో ఆడతారు.
WI vs IND Playing 11:
భారత్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ (కెప్టెన్), 3. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కోన శ్రీకర్ భరత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, జయ్‌దేవ్ ఉనద్కత్/శార్దూల్ ఠాకూర్, ముఖేశ్ కుమార్.
వెస్టిండీస్: క్రైగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టాగెనరైన్ చంద్రపాల్, రేమాన్ రీఫర్, రకిమ్ కార్న్‌వాల్, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, షానన్ గాబ్రియేల్.
WI vs IND Dream11 Team:
రోహిత్ శర్మ, క్రైగ్ బ్రాత్‌వైట్, శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, జెర్మైన్ బ్లాక్‌వుడ్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, టాగెనరైన్ చందర్‌పాల్, రేమన్ రీఫర్, మొహమ్మద్ సిరాజ్.
Also Read: ODI World Cup 2023 Tickets Price: అభిమానులకు గుడ్‌న్యూస్.. ప్రపంచకప్ 2023 టికెట్ల ధరలు ఇవే!