Bad Cholesterol: చెడు కొలెస్ట్రాల్ నుండి మీ గుండెను రక్షించుకోవాలంటే ఈ నూనెలను వాడాల్సిందే!
- చెడు కొలెస్ట్రాల్ నుండి మీ గుండెను రక్షించుకోవాలంటే కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ వాడాలి.
- ఆవ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల అనేక ప్రయోజనాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bad Cholesterol: ప్రస్తుత కాలపు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వల్ల గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (LDL) అధికంగా ఉండడం గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుని గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు లాంటి సమస్యలకు దారితీస్తుంది. వీటి నుండి మనం బయటపడాలంటే.. ఆహారపు అలవాట్లను మార్చుకోవడం, ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. డైటీషియన్ల సూచన ప్రకారం, కోల్డ్ ప్రెస్‌డ్ ఆయిల్స్ ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇవి సహజమైన విధానంలో తయారు చేయబడటంతో అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వీటిలో అధికంగా ఉంటాయి. కాబట్టి, గుండె ఆరోగ్యానికి ఉత్తమమైన 3 వంట నూనెల గురించి చూద్దాం..
Also Read: Union Budget 2025: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..
Also Read
- Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
- Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
- సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
- Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ఆవ నూనె:
ఆవ నూనె గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఓమేగా-3 ఫ్యాటి యాసిడ్లు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది. మంటను తగ్గించడంతో పాటు గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
నువ్వుల నూనె:
నువ్వుల నూనెలో సెసామిన్, సెసామోల్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి.
Also Read: Karthi : తండేల్ రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను
ఆలివ్ నూనె:
ఆలివ్ నూనెను సూపర్ ఫుడ్ గా కూడా పిలుస్తారు. ఇందులో మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ (MUFA) పుష్కలంగా ఉండటంతో, హృదయ సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గించగలదు. అంతేకాకుండా, ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
ఈ కోల్డ్ ప్రెస్‌డ్ నూనెల వల్ల ఉపాయగల విషయానికి వస్తే.. ఇందులో హానికరమైన రసాయనాలు ఉండవు. అలాగే వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇవి సహజ రుచులను కలిగి ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవాలంటే, రోజువారీ వంటల్లో ఈ ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించండి. ఆహారంలో మార్పులు చేసుకోవడం ద్వారా గుండెపోటు, ఇతర గుండె సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.
తాజావార్తలు
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!