Karthi : తండేల్ రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. తాజాగా గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్బంగా కార్తీ మాట్లాడూతూ ‘‘నాకు టాలీవుడ్‌లో చాలా గొప్ప ప్రేమ దొరికింది. తండేల్ మూవీ 2018లో జరిగిన రియల్ స్టోరీ అని తెలిసి ఆశ్చర్యపోయాను. మన జాలర్లు పాకిస్థాన్‌కు వెళ్లి అక్కడి వారికి దొరికిపోవటం, అక్కడి నుంచి తప్పించుకని రావటం ఇదంతా చక్కటి ప్రేమ కథగా తెరకెక్కించారు. 20 మంది దగ్గర రైట్స్ తీసుకుని, మూడేళ్లు స్క్రిప్ట్ తయారు చేసి, ఏడాదిన్నర పాటు షూటింగ్ చేశారంటే ఆ సినిమా అంటే వాళ్లకెంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. చందు మొండేటి కెరీర్‌లో చాలా హిట్ మూవీస్ చేశారు. అదే కోవలో ఈ సినిమాను ఎంతగానో నమ్మి ఈ సినిమా కోసం అద్భుతమైన సినిమాగా చేశారు. అల్లు అరవింద్ చాలా ఏళ్లుగా నిర్మాతగా కొనసాగుతున్నారంటే మామూలు విషయం కాదు కేవలం బిజినెస్ మాత్రమే కాదు, ప్యాషన్ కూడా ఉండాలి. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. తండేల్ చాలా పెద్ద సక్సెస్‌ను సాధించాలి. దేవిశ్రీప్రసాద్ గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. సాయిపల్లవి చేసే ప్రతీ పాత్రను అద్భుతంగా చేస్తుంది. ప్రతీ ఎమోషన్‌ను చక్కగా పలికిస్తుంది. అందుకనే అందరికీ తను ఎంతగానో నచ్చుతుంది. ఎ.ఎన్.ఆర్‌గారు, నాగార్జునగారితో ఇక్కడి వారికి మంచి అనుబంధం ఉంది. నేను నాగార్జునతో కలిసి పని చేశాను కూడా. నాగ చైతన్య ఇన్నోసెన్స్‌లా కనిపించే అద్భుతమైన యాక్టర్. తనపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. తండేల్ కోసం ఎంతో కష్టపడ్డారు. ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతోన్న సినిమా తమిళంలో పెద్ద హిట్ అవుతుంది. సినిమాను తమిళంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ప్రభుకి అభినందనలు’’ అన్నారు.
Also Read
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
తాజావార్తలు
-
IIT Bombay Student:పరీక్షలో ChatGPT వాడుతూ పట్టుబడ్డ IIT బాంబే విద్యార్థి ఆ*త్మహ*త్య.. క్యాంపస్‌లో నిరసనలు
-
BCCI: కోచ్‌గా అతడు తాత్కాలికమే.. పనితీరు నచ్చితేనే టీమిండియాలో ఉంటాడు!
-
Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
-
TRAI Tightens Spam Call Rules:స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కఠిన నిబంధనలు.. AIతో ఫేక్ నంబర్ల గుర్తింపు, భారీ జరిమానాలు!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..